ఆంధ్రప్రదేశ్‌

రెండు రోజుల్లో మట్టిలో కలిసిపోతాం...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 19: ‘రెండు రోజుల్లో మట్టిలో కలిసిపోయే దేహానికి ఈ పరీక్షలు అవసరమా...’ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆదివారం రాత్రి తన సమీప బంధువుతో పలికిన మాటలివి. ఆదివారం ముద్రగడ దంపతుల దీక్ష 11వ రోజుకు చేరిన నేపథ్యంలో ఆయన వియ్యంకుడు (చిన్న కోడలి తండ్రి) సోమేశ్వరరావు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. రాత్రి సమయంలో ఆసుపత్రి నుండి బయటకు వచ్చిన ఆయనను మీడియా చుట్టుముట్టింది. ఈసందర్భంగా ఆయన చాలా ఆందోళనకరంగా మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్యుల ఆదుర్దాను బట్టి, గుండె సంబంధిత సమస్య ఎదురైనట్టు స్పష్టమవుతోందని, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకు అంగీకరించాలని వైద్యులు చేసిన విజ్ఞప్తిమేరకు ముద్రగడను ఒప్పించడానికి ప్రయత్నించినట్టు తెలిపారు. ఈ సందర్భంగానే రెండు రోజుల్లో మట్టిలో కలిసిపోయే దేహానికి ఈ పరీక్షలు అవసరమా అంటూ నిరాకరించారని సోమేశ్వరరావు ఆవేదన వ్యక్తంచేశారు. ముద్రగడ దంపతుల పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, వైద్యులు బయటకు చెబుతున్న విషయాలు అవాస్తవాలని పేర్కొన్నారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే తమకు ఆందోళనగా ఉందని, బాగా శుష్కించిపోయారని కన్నీటి పర్యంతమయ్యారు. కాకినాడ నుండి గుండె వ్యాధుల వైద్య నిపుణులు వచ్చి పరీక్షలు చేశారని, అయితే విషయాలు బయటకు చెప్పడం లేదన్నారు. మెరుగైన వైద్యం కోసం బయట ప్రైవేటు ఆసుపత్రికి తరలించేలా అంబులెన్సు సిద్ధం చేశారని, తాము ప్రాధేయపడినా ముద్రగడ అందుకు అంగీకరించడం లేదన్నారు.

‘కాపు’కాస్తున్న బిజెపి!

ముద్రగడ ఉద్యమ చర్చల్లో కీలక భూమిక
వ్యూహాత్మకంగా అడుగులు

ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, జూన్ 19: మాజీ మంత్రి ముద్రగడ సాగిస్తున్న ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చూస్తున్న బిజెపి ఇక్కడ బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపులను తమవైపు తిప్పుకోవడానికి పావులు కదుపుతోందనే సందేహం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా ఆమరణ దీక్షలో ఉన్న ముద్రగడతో జరుపుతున్న చర్చల్లో బిజెపికి చెందిన రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కీలకపాత్ర పోషిస్తుండగా, మరోవైపు రైల్వే కేసుల వ్యవహారంలో సైతం కాస్త సానుకూలత ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. పార్టీ పరంగా వచ్చిన సంకేతాలతోనే రాజమహేంద్రవరం నగర శాసన సభ్యుడు ఆకుల సత్యనారాయణ ఈ ఉద్యమంపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నట్టు తెలియవచ్చింది. ముద్రగడ డిమాండు మేరకు తుని ఘటనకు సంబంధించి రిమాండులో ఉన్న వారంతా బెయిలుపై బయటకు వచ్చినా, ఇదే అదనుగా రైల్వే కేసుల్లో వారంట్ పిటీషన్లు వేయడానికి రైల్వే పోలీసులు కాచుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఈ పరిస్థితుల్లో సమస్యను మరింత జఠిలం అవుతుందని స్థానిక బిజెపి నాయకులు చేసిన విజ్ఞప్తిమేరకు పార్టీలో జాతీయస్థాయిలో కీలక స్థానంలో ఉన్న ఒక నేత చొరవ తీసుకుని రైల్వే కేసుల్లో వారంట్లు పడకుండా నివారించినట్టు సమాచారం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తున్నా, కేంద్ర సహకరించలేదనే అపవాదు పార్టీపై పడకుండా ఈ చర్యలు తీసుకున్నట్టు సమాచారం. అదే సమయంలో కాపుసామాజిక వర్గాన్ని ఆకట్టుకునే వ్యూహం కూడా ఇందులో ఇమిడివున్నట్టు తెలియవచ్చింది. కాగా ఈ వ్యవహారాలన్నీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆధ్వర్యంలో కాకుండా ఎమ్మెల్యే ఆకులతో నడిపిస్తుండటం మరో కీలకపరిణామంగా చెప్పవచ్చు. సోముతో తెలుగుదేశం పార్టీ నేతలకు సత్సంబంధాలు లేని నేపథ్యంలో వ్యవహారం బెడిసికొట్టకుండా ఎమ్మెల్యే ఆకులను రంగంలోకి దించినట్టు తెలివచ్చింది. ఇప్పటికే కాపు జెఎసిలో భాగస్వామిగా ఎమ్మెల్యే ఆకుల ముద్రగడతో పలుమార్లు చర్చలు జరిపారు. రిమాండులో ఉన్న 13మంది బయటకు వస్తే దీక్ష విరమించేలా ముద్రగడను ఒప్పించారు. వృత్తిరీత్యా వైద్యుడు కూడా అయిన ఎమ్మెల్యే ఆకుల ఇప్పటికే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఒత్తిడిచేసి, ముద్రగడ కుమారుడు, కోడలు దీక్ష విరమింపజేయడంలో కీలకపాత్ర పోషించారు. ఈ పరిణామాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని బిజెపి నాయకత్వం కాపు ఉద్యమ వ్యవహారాన్ని సానుకూలంగా పరిష్కరించడం ద్వారా ఆ సామాజికవర్గంను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు సాగిస్తోందని రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు.
అవరోధంగా స్థానిక రాజకీయాలు
కాగా ముద్రగడ ఆమరణదీక్ష వ్యవహారాన్ని సాధ్యమైనంత సానుకూలంగా, త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు స్థానిక రాజకీయాలు కొంతమేర అవరోధంగా నిలుస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. బెయిలుపై విడుదలవుతున్న వారిలో ఒకరిని తిరిగి కస్టడీలోకి తీసుకోవడానికి సిఐడి అధికార్లు ప్రయత్నించడం వెనుక అధికార పార్టీకి చెందిన ఒక నేత హస్తముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రిమాండులో ఉన్న 13మంది బయటకు వచ్చాక దీక్ష విరమణ అనే డిమాండును ముద్రగడ ప్రధానంగా ప్రస్తావిస్తున్న తరుణంలో బెయిలు వచ్చిన ఒకరిని తిరిగి కస్టడీలోకి తీసుకోవడం వెనుక మతలబు ఏమిటని కాపు సామాజికవర్గ నేతలు ప్రశ్నిస్తున్నారు.