ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర పథకాలకు పేర్లు కావలెను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 19: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మం త్రిత్వ శాఖలు తాము ప్రవేశపెట్టనున్న పథకాలకు పేర్లు, లోగోలను డిజైన్ చేయాల్సిందిగా ప్రజలను కోరుతున్నాయి. కేంద్రప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తూ వాటికి ఆకర్షణీయమైన పేర్లు పెట్టేందుకు, లోగోలను, ట్యాగ్ లైన్లను రూపొందించేందుకు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మై గవ్ యాప్ ద్వారా ఈ పోటీలను నిర్వహిస్తున్నది. ఆ వివరాలను ఆ యాప్ ద్వారా అప్‌లోడ్ చేసే వీలు కూడా కల్పించారు. ఔషధ నియంత్రణ కింద మందుల ధరలను నియంత్రించే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ)కు లోగో తయారు చేయాలని పోటీ నిర్వహిస్తున్నది. ఎంట్రీలు పంపేందుకు జూలై 21 ఆఖరు కాగా, ఎంపికైన ఎంట్రీకి 30 వేల రూపాయలు బహుమతి అందించేందుకు నిర్ణయించారు. తక్కువ విద్యుత్ వినియోగించే ట్యూట్ లైట్ల వినియోగాన్ని ప్రోత్సహించే పథకమైన నేషనల్ ట్యూబ్ లైట్స్ ప్రోగ్రామ్‌కు పేరు సూచించాలని పోటీ నిర్వహిస్తున్నారు. నేషనల్ ఎనర్జీ ఎఫీషియంట్ ఫ్యాన్ ప్రోగ్రామ్‌కు, స్ట్రీట్ లైట్ నేషనల్ ప్రోగ్రామ్‌కు కూడా పేర్లు సూచించాలని కోరుతున్నారు. ఈ పోటీలకు గడువు ఈ నెల 30 కాగా ఒక్కో పథకానికి 10 వేల రూపాయల బహుమతి ఇవ్వనున్నారు. భారత తపాలా శాఖకు చెందిన బ్యాంకింగ్ సర్వీసులకు సంబంధించి లోగో, ట్యాగ్‌లైను ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంక్ (ఐపిపిబి)కు రూపొందించాలని నిర్వహిస్తున్న పోటీకి చివరి తేదీ జూలై 9. ఎంపికైన ఎంట్రీకి 50 వేల రూపాయలు చెల్లించనున్నారు. డిపార్టుమెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఐటి శాఖ సెప్టెంబర్‌లో నిర్వహించనున్న మెడికల్ ఎలక్ట్రానిక్స్ కాన్ఫరెన్స్‌కు కూడా పేరు సూచించాలని పోటీ పెట్టారు. డైరెక్టు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ పోర్టల్‌కు హోస్టు పేరు సూచించాలని కూడా పోటీ ఉంది. ఇక దేశంలోని యువతకు స్ఫూర్తినిచ్చే యువజన గీతాన్ని రూపొందించేందుకు కూడా పోటీ నిర్వహిస్తున్నారు. యువజన వ్యవహారాలు, క్రీడలు మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న పోటీకి దేశభక్తితో కూడిన, 21వ శతాబ్దాన్ని ప్రతిబింబించేలా హిందీలో గీతాన్ని స్వరపరిచేందుకు గడువును జూలై 15గా విధించారు. ఎంపికైన గీతానికి లక్ష రూపాయలు బహుమతి చెల్లిస్తారు. ఇప్పటికే శ్రీరామ నవమి, అంబేద్కర్ జయంతి, బుద్ధ పూర్ణిమ తదితర రోజులకు సంబంధించి ఈ-గ్రీటింగ్ కార్డుల రూపకల్పన పోటీలను నిర్వహించారు. కిరోసిన్ రహిత చండీగఢ్‌కు లోగో, పోలీసు మృతవీరులను దృష్టిలో ఉంచుకుని నేషనల్ పోలీస్ మెమోరియల్ శిల్పం రూపకల్పనకు, దేశంలో వివిధ ప్రాంతాల్లో నిర్మించనున్న రైల్వే వంతెనలు, అండర్ బ్రిడ్జిలకు సేతు బంధన్ పేరుతో లోగో తదితర అంశాలపై ఇప్పటికే పోటీలను నిర్వహించారు. ఇతర వివరాలకు ఆ యాప్‌లో చూడవచ్చు. విజేతల వివరాలను కూడా యాప్‌లో ప్రకటించడం గమనార్హం.