ఆంధ్రప్రదేశ్‌

పిఎస్‌ఎల్‌వి-సి34 ప్రయోగానికి నేటి నుంచి కౌంట్‌డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జూన్ 19: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నద్ధమైంది. ఈనెల 22న భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి పిఎస్‌ఎల్‌వి-సి 34 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) ఆదివారం షార్‌లో డాక్టర్ సురేశ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్‌తో పాటు పలువురు శాస్తవ్రేత్తలు హాజరై ప్రయోగంపై సుదీర్ఘంగా చర్చించారు. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు వారు (ల్యాబ్) సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత తెలిపి నిర్దేశించిన సమయానికే ప్రయోగం జరిపేందుకు తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ 48 గంటల ముందు అనగా సోమవారం ఉదయం 9:25 గంటలకు ప్రారంభం కానుంది. కౌంట్‌డౌన్ నిర్విఘ్నంగా కొనసాగిన అనంతరం 22వ తేదీ ఉదయం 9:25 గంటలకు రాకెట్ నింగిలోకి ఎగరనుంది. పిఎస్‌ఎల్‌వి సి-34 వాహక నౌక ద్వారా మన దేశానికి చెందిన కార్టోశాట్-2సి ఉపగ్రహంతో పాటు అమెరికా, ఇండోనేసియా, కెనడా దేశాలకు చెందిన 17 ఉపగ్రహాలు, చెన్నై సత్యభామ విశ్వవిద్యాలయం విద్యార్థులు, పుణె ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించిన మరో రెండు బుల్లి ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి పంపనున్నారు. ఇప్పటివరకు ఇస్రో ఒకేసారి ఇన్ని ఉపగ్రహాలను పంపడం ఇదే ప్రథమం. 2008లో 10 ఉపగ్రహాలను పంపి విజయం సాధించింది. కౌంట్‌డౌన్ పనితీరు, రాకెట్ ప్రయోగ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్‌కుమార్ షార్‌కు మంగళవారం రానున్నారు. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో రాకెట్‌కు ఇంధనాన్ని నింపి అన్ని భాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రయోగం దృష్ట్యా షార్‌లో భారీ బందోబస్తు విధించారు.

ప్రయోగ వేదికపై పిఎస్‌ఎల్‌వి సి-34