ఆంధ్రప్రదేశ్‌

ఇక రాష్ట్రంలో భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19 :ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో వచ్చే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. నైరుతీ రుతుపవనాలు ఆదివారం వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పూర్తిగా విస్తరించి మధ్యభారత్, ఉత్తర భారత్‌లో విస్తరిస్తున్నాయని తెలిపారు. రుతుపవనాల మూలంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో వచ్చే 48 గంటల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి వెల్లడించింది. దక్షిణ చత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా తెలంగాణ వ్యాప్తంగా 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయని ఐఎండి శాస్తవ్రేత్త చరణ్‌సింగ్ వెల్లడించారు. రుతుపవనాల మూలంగా తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం తదితర జిల్లాలతో పాటు, తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది.