ఆంధ్రప్రదేశ్‌

కోనసీమలో క్రాప్ హాలిడే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూన్ 19: సాగులో ఎదురవుతున్న సమస్యల కారణంగా మరోసారి పంట విరామం దిశగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమ రైతాంగం సమాయత్తమవుతోంది. 2011లో ఒకసారి కోనసీమ రైతాంగం పంటవిరామం ప్రకటించి, పొలాలను బీళ్లుగా వదిలేసిన సంగతి విదితమే. కోనసీమలో 1.5 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఈ నేపథ్యంలో మరోసారి రైతాం గం అదేబాటలో నడవాలని యోచిస్తోంది. ఆరుగాలం శ్రమించి సాగుచేసినా గిట్టుబాటు ధర లేకపోవడం, మద్దతు ధర కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బంది పెట్టే నిబంధనలు రైతులను మనోవ్యధకు గురిచేస్తున్నాయి. విపరీతంగా పెరిగిపోయిన ఎరువుల ధరలు, కూలీల కొరత కూడా రైతులను పట్టిపీడిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే దిశగా రైతులు సమాయామవుతున్నారు. కోనసీమలోని ముమ్మిడివరం మండలం అనాతవరం రైతాంగం ఖరీఫ్ సాగు చేయలేమని ఇటీవల స్పష్టం చేశారు. ఈ గ్రామంలో సుమారు 1040 ఎకరాల సాగుభూమి ఉంది. ఇదే విషయమై రైతులను చైతన్యపరచి, మరోసారి కోనసీమ అంతటా పంట విరామం ప్రకటించడానికి రైతు నేతలు ప్రచారం ప్రారంభించారు.
2011లో కోనసీమలో పంట విరామం ప్రకటించడం జాతీయస్థాయి సంచలనానికి కారణమయ్యింది. జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు వచ్చి ఇక్కడ పరిస్థితులపై అధ్యయనంచేశారు. పలు సమస్యలు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో రైతు ఉద్యమానికి దిగొచ్చిన ప్రభుత్వం 20 హామీలు ఇచ్చింది. అయితే వాటిలో చాలా హామీలు నేటికీ అమలుకాలేదు.
రైతుల ఆగ్రహానికి కారణాలివే!
* నీలం , హుద్‌హుద్, హెలెన్ తుపాన్ల కారణంగా వాటిల్లిన నష్టాలకు సంబందించిన పరిహారాన్ని నేటికీ పూర్తిగా రైతులకు చెల్లించలేదు.
* గత ఏడాది సంబవించిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామన్న హామీని ప్రభుత్వం పట్టించుకోలేదు.
* స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం పెట్టుబడికి 50 శాతం కలిపి లాభసాటి ధర కల్పిస్తామన్న హామీని తుంగలో తొక్కారు.
* ప్రసుతం కేంద్రం క్వింటాలుకు పెంచిన రూ.60 ఏమూలకు సరిపోతుందనేది రైతుల ప్రశ్న.
* పంట విరామం సమయంలో అప్పట్లో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కేంద్రం మద్దతు ధరకు అదనంగా క్వింటాలుకు రూ.200లు చెల్లిస్తామన్న హామీ ముఖ్యమంత్రి అయినా నెరవేరలేదు.
* ప్రతీ ఏటా మే 15 తేదీకల్లా సాగు నీరు ఇవ్వాలన్న డిమాండ్‌కు ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. నేటికీ పంట కాల్వల ఆధునీకీకరణ పనులు, రెవెన్యూ డ్రెయిన్‌లు అధునీకీకరణ పనులు పూర్తికాలేదు.
ఈనేపథ్యంలో ధైర్యం చేసి సాగు చేస్తే సాగు నీరు సక్రమంగా అందుతుందా లేదా అనేది ఒక సమస్యైతే, ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు ఎక్కువగా కురిస్తే పంట నష్టం జరిగితే తమను ఎవరు ఆదుకుంటారనే భయం రైతులను వెంటాడుతోంది. ఈ ఏడాది మే నెలలో కురిసిన చిన్నపాటి వర్షానికే పంట పోలాలు నీట మునిగిపోయి నీరు బయటకు వెళ్లని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇన్ని సమస్యల నడుమ రైతులు సాగు చేసేకన్నా తమ చేలను ఖాళీగా వదిలేయడమే మేలు అన్న ఆలోచనకు వచ్చారు. సాగు చేస్తే ఎకరాకు రూ.5000 నుండి రూ.10 వేలు నష్ట వస్తుందని, చేయపోతే మానసిక ప్రశాంతత చేకూరుతుందని పలువురు రైతులు వ్యాఖ్యానిస్తున్నారు.

పంట విరామం కోసం ముమ్మిడివరం మండలం అనాతవరంలో సమావేశమైన రైతులు (ఫైల్ ఫొటో)