రాష్ట్రీయం

చింటూయే హంతకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 14: చిత్తూరు నగర మేయర్ దంపతుల హత్యకు పథకం రచించింది, హత్య చేసింది తానేనని చంద్రశేఖర్ అలియాస్ చింటూ ఒప్పుకున్నట్లు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ వెల్లడించారు. సోమవారం ఎస్పీ తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
గతనెల 17న జరిగిన మేయర్ కఠారి అనురాధ, భర్త మోహన్‌ల హత్య ఎలా జరిగింది, దానికి ప్రధాన నిందితుడు వేసిన ప్రణాళిక, అనుచరుల సహకారం, తదనంతర పరిణామాలు, కస్టడిలో వెల్లడించిన అంశాలను ఎస్పీ వివరించారు. మేయర్ దంపతుల హత్యకు చింటూ ఆరు నెలలుగా పథకం వేశాడన్నారు. బెంగళూరు పుణ్యక్షేత్రానికి వెళ్లేటప్పుడు అక్కడ మట్టుపెట్టాలని యోచించాడని, అయితే వారు ఆ క్షేత్రానికి వెళ్లలేదన్నారు. మరోసారి కార్పొరేషన్ కార్యాలయంలోనే మట్టుపెట్టాలని చూశాడని, ఆరోజు ఒక మహిళతో మేయర్ వాదనకు దిగడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడన్నారు. మూడోసారి పక్కా ప్రణాళికతో అనూరాధ దంపతులను మట్టుపెట్టినట్టు విచారణలో చింటూ అంగీకరించాడన్నారు. సురక్షిత ప్రాంతమని బెంగళూరులో తలదాచుకున్నాడని, అయితే తన కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలుసుకుని, దండుపాళ్యానికి చెందిన ఆర్వేటి బాబు, రఘు సహకారంతో న్యాయవాది ఆనంద్ సేవలు వినియోగించుకున్నట్టు ఎస్పీ పేర్కొన్నారు. న్యాయవాది ఇచ్చిన సూచనలతో చింటూ తాను కోర్టులో లొంగిపోతున్నట్టు రాసిన లేఖలను మూడు పత్రికా సంపాదకులకు, చిత్తూరు, హైకోర్టు న్యాయమూర్తులకు, జిల్లా ఎస్పీ తదితరులకు అందజేయగలిగాడన్నారు. మేయర్ కర్మక్రియలు ముగిసిన తర్వాత దండుపాళ్యం లోకేష్ ద్విచక్రవాహనం వెనుక కూర్చుని పుంగనూరు మీదుగా చిత్తూరువచ్చి కోర్టులో లొంగిపోయాడని ఎస్పీ వివరించారు. కాగా ఇప్పటి వరకు 23మందిపై కేసులు నమోదు చేశామని, ఇద్దరిని వినా మిగతావారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్టు వివరించారు.