రాష్ట్రీయం

పేదరికాన్ని రూపుమాపుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: కేంద్రం పేదరిక నిర్మూలన, నీటి పారుదల, విద్యుత్ తదితర అంశాలపై ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్సులతో ఏపీలోని ఏడు మిషన్లు సమన్వయపర్చి పనిచేయడం ద్వారా పేదరికంలేని రాష్ట్రంగా ఆంధ్రను తీర్చిదిద్దాలని సిఎం చంద్రబాబు సూచించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో ఏడు మిషన్ల వ్యవహారాన్ని ఆయన ప్రస్తావించారు. ఏడు మిషన్లు వాటికింద శాఖలు, సబ్ మిషన్లు, కోఆర్డినేటర్లు, కన్సల్టెంట్లు సమన్వయంతో పనిచేయాలని సిఎం కోరారు. పాజిటివ్ పాలసీలను రూపొందించడమేగాక వృద్ధిరేటు పెంపునకు వాటిని అనుసంధానించాలని అన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖకు ఎక్స్‌పర్టు గ్రూపులను నియమించుకోవాలని సూచించారు. ప్రైమరీ సెక్టారు నుండి రాబడి రెండింతలు పెంచుకోవాల్సి ఉందని, వృద్ధిరేటు 24 శాతం ఉండగా, పారిశ్రామికాభివృద్ధి రేటు తక్కువగా ఉందని అది సరికాదని వ్యాఖ్యానించారు. ఏపీని ఎడ్యుకేషనల్ హబ్‌గా, మెడికల్ హబ్‌గా చేస్తే అటు విద్యా వైద్య అభివృద్ధితోపాటు ప్రభుత్వ రాబడి కూడా ఇతోధికంగా పెరుగుతుందన్నారు. ప్రాథమికరంగం మిషన్‌తో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని సూచించారు. లాభసాటి వ్యవసాయం అంటే భూసార పరీక్షచేసి ఏయే పంటలు సాగు చేస్తే లాభం వస్తుందో నిర్ణయిస్తారని, రాయితీపై విత్తనాలు, ఎరువుల సరఫరా నుంచి పంట ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్ సదుపాయాల వరకూ ప్రభుత్వం పర్యవేక్షించడమేనని చంద్రబాబు అన్నారు.