తెలంగాణ

ముదిరిన మూడేళ్ల వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జెఎసి, టిఆర్‌ఎస్ పార్టీల మధ్య వివాదం ముదురుతోంది. బుధవారం టిజెఎసి కీలక సమావేశం నిర్వహించి మంత్రుల వాఖ్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని టిజెఎసి చైర్మన్ ప్రొ. కోదండరామ్ స్పష్టం చేశారు. నాంపల్లిలోని టిజెఎసి కార్యాలయంలో బుధవారం ఉదయం పది గంటలకు టిజెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశం జరగనుంది. మంత్రుల విమర్శలు, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిం చి నిర్ణయం తీసుకోనున్నారు. జెఎసి ఎవరో నడిపిస్తే నడిచే సంస్థ కాదని, ప్రజల పక్షాన ఉంటామని కోదండ రామ్ చెప్పారు. రెండేళ్ల టిఆర్‌ఎస్ పాలనపై తాను ఏం మాట్లాడిందీ యూట్యూబ్‌లో ఉంది, నేను అన్న మాటలు, దానిపై టిఆర్‌ఎస్ మంత్రుల స్పందనపై బుధవారం నాటి టిజెఎసిలో అన్ని కోణాల్లో చర్చించి స్పందిస్తామని కోదండరామ్ తెలిపారు. టిజెఎసిని రాజకీయ పార్టీగా మారుస్తారనే ప్రచారం చాలాకాలం నుంచి జరుగుతుండటం, అలాంటిదేమీ లేదని కోదండరామ్ చెబుతుండటం అం దరికీ తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో కోదండరామ్ కదలికలు అన్ని పార్టీల వారికి ఆసక్తిని కలిగిస్తున్నాయి. రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే అవకాశం ఉందా? అనే కోణంలో అన్ని పార్టీల్లో చర్చలు సాగుతున్నాయి. టిఆర్‌ఎస్ ఎప్పుడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో స్పందించడం సైతం అనుమానాలను రేకెత్తిస్తోంది. మరోవైపు రాష్ట్ర మంత్రులు కోదండరామ్‌పై తమ విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, టిడిపి నాయకులు కోదండరామ్‌కు మద్దతు పలకడం విభేదాల తీవ్రతను బయటపెడుతోంది.
కెసిఆర్, కోదండరామ్‌ల మధ్య విభేదాలు ఇప్పుడు బయటపడ్డా గత మూడేళ్ల నుంచి అంతర్లీనంగా కొనసాగుతున్నాయి. ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ నిర్వహించిన సమయంలోనే కోదండరామ్ వైఖరిపై టిఆర్‌ఎస్ వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం విదితమే. అప్పటినుంచి ఒకదాని తరువాత మరొకటి అలా పెరుగుతూ పోయాయి.
ప్రభుత్వ పాలన బాగుందని తొలినాళ్లలో అభినందించిన కోదండరామ్ అమెరికా వెళ్లి వచ్చిన తరువాత ఆయనలో మార్పు వచ్చిందని, అక్కడ ఏం జరిగిందని టిఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. టిఆర్‌ఎస్, టిజెఎసిల మధ్య కోల్డ్‌వార్, తెర వెనుక రాజకీయాలు సాగుతున్నా బహిరంగంగా విమర్శలు చేసుకోవడం, దాడి ఎదురుదాడికి దిగడం ఇదే మొదటి సారి.
2009లో కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి తెరవెనక్కి వెళ్లినప్పుడు టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ అన్నిపార్టీల కలుపుకొని ఉద్యమించడానికి తెలంగాణ జెఎసి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. టిజెఎసి ఏర్పాటులో టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ప్రధాన భూమిక, కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, టిడిపి, న్యూ డెమోక్రసీ పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు టిజెఎసిలో పాల్గొన్నారు. కోదండరామ్ నాయకత్వం పట్ల అప్పుడు టిడిపి సైతం మద్దతు ఇచ్చింది. అధికారంలో ఉండడం వల్ల టిజెఎసి నుంచి తొలుత కాంగ్రెస్ బయటకు వచ్చింది. టిడిపిని జెఎసి బహిష్కరించింది. తెలంగాణ ఏర్పాటు ఉద్యమం టిజెఎసి నాయకత్వంలో సాగినా తెలంగాణ ఆవిర్భావం తరువాత టిజెఎసి పాత్ర నామ మాత్రంగా మారింది.
సాధారణ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని జెఎసి తరఫున పిలుపు ఇవ్వాలని కెసిఆర్ కోరగా, అందుకు జెఎసి అంగీకరించకపోవడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. తెలంగాణ ఏర్పడిన తరువాత జెఎసిలోని రాజకీయ పక్షాలన్నీ ఎవరి దారిలో వారు వెళ్లడంతో జెఎసి ప్రభావం తగ్గుతూ వచ్చింది. రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలే టిజెఎసిలో కీలక భూమిక పోషించాయి. తొలుత రాజకీయ పక్షాలు, తరువాత ఉద్యోగ సంఘాలు జెఎసి నుంచి బయటకు రావడంతో ప్రాభవం తగ్గింది. అయతే తాజాగా అధికార పార్టీ, టిజెఎసి మధ్య విభేదాలు తారస్థాయకి చేరడంతో టిఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే పలు ప్రజా సంఘాలు జెఎసి పట్ల ఆసక్తి చూపుతుండటం తాజా పరిణామం.