తెలంగాణ

తెలంగాణ లారీలకు సింగిల్ పర్మిట్‌కోసం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: తెలంగాణ లారీలకు రవాణా కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి సింగిల్ పర్మిట్లు అందేలా కృషి చేస్తానని రవాణా శాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు వి శ్రీనివాస్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ తదితరులు మంత్రిని సచివాలయంలో కలుసుకొని సమస్యలు వివరించారు. దీంతో స్పందించిన మంత్రి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మతో కలసి లారీ యజమానులతో చర్చించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తాత్కాలిక పర్మిట్‌గా ఒక్క రోజుకు రూ. 1400లు వసూలు చేస్తున్నారని, నెలసరిగా రూ. 5000లు వసూలు చేస్తూ ఏడాదికి రూ. 8000లు వసూలు చేస్తున్నారని వివరించారు. ఇది ఇరు రాష్ట్రాల లారీల యజమానులతో పాటు వినియోగదారులకు సైతం భారంగా మారుతుందని అన్నారు. అయితే పొరుగు రాష్ట్రాలు సింగిల్ పర్మిట్లకు ఏడాదికి కేవలం రూ. 5వేలు మాత్రమే వసూలు చేస్తున్నాయన్నారు. సింగిల్ పర్మిట్ మీద ఏపి ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దేశంలో ఇతర రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీల స్థాయిలో అధికారులు ఈ నెల 9న సమావేశం అవుతారని చెప్పారు. అధికారుల స్థాయిలో సమస్య పరిష్కారం కాకుంటే తామే ఏపి రవాణా మంత్రితో సమావేశం అవుతామని వివరించారు. తెలంగాణలో లారీ యాజమాన్యాల అసోసియేషన్ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల మీద తిరిగే లారీల డ్రైవర్లకు వసతులు కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.