తెలంగాణ

బ్యారేజీ కట్టుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో పెన్‌గంగ నదిపై తెలంగాణ నిర్మించ తలపెట్టిన చనాఖా -కొరాట బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చింది. నవంబర్ 21న ముంబయిలో ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన సమావేశ చర్చల వివరాలను లేఖ రూపంలో పొందుపర్చి పంపించారు. బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన అంతరాష్ట్ర ఒప్పందాలను సాధ్యమైనంత త్వరలో ఖరారు చేసుకోవాలని కోరింది. రెండు రాష్ట్రాల రైతులకు లబ్దిచేకూరేలా పెన్‌గంగపై ఒప్పందాల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలన్ని సూచించింది. బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్ర అనుమతి ఇవ్వడంతో బ్యారేజీ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. బ్యారేజీ నిర్మాణం కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 368 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులకు ఉత్తర్వులు జారీ చేసింది. బ్యారేజీ నిర్మాణం సత్వరం చేపట్టేవిధంగా వచ్చేవారం టెండర్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీనికోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీశ్ ఆదేశించారు. జనవరిలో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో పర్యటన
నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో మంత్రుల బృందం మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తోంది. మధ్యప్రదేశ్‌లో సాగునీటి కాలువల ద్వారా కాకుండా పైప్‌లైన్ ద్వారా పొలాలకు నీళ్లందిస్తున్న ప్రాజెక్టును పరిశీలించేందుకు నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు నాయకత్వంలోని బృందం మధ్యప్రదేశ్ వెళ్లింది. ఓంకారేశ్వర్ ప్రాజెక్టు నాల్గవ దశను, లిఫ్ట్ ఇరిగేషన్, ఆయకట్టుకు నీటిని పైపులైన్ల ద్వారా అందించటం తదితర అంశాలపై ఈ బృందం అధ్యయనం చేస్తుంది. మంత్రుల బృందంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.