ఆంధ్రప్రదేశ్‌

మచిలీపట్నం రేవుకు లైన్‌క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: మచిలీపట్నం రేవు బాలారిష్టాలను అధిగమించింది. ఈ పోర్టును రూ. 11,900 కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు వౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదించింది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి చర్చించి ప్రకటన చేయనున్నారు. 2022 నాటికి ప్రతిష్ఠాకరమైన ఈ ఓడరేవు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు వౌలిక సదుపాయాల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మొదటి దశ నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తారు. భూసేకరణ నోటిఫికేషన్‌ను వచ్చే నెలలో జారీ చేసి రెండు నెలల్లో భూమిని సేకరించే పనులను పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోర్టుల డైరక్టెరేట్ కార్యాలయం సమాయత్తమవుతోంది. ఈ పోర్టులో మొత్తం 26బెర్తులు ఉంటాయి. మొదటి దశలో 15 బెర్తుల నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. 2022 నాటికి వంద మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు లక్షల టన్నుల బరువు ఉన్న స్టీమర్లను కూడా హ్యాండిల్ చేసేవిధంగా మచిలీపట్నం రేవును డిజైన్ చేస్తారు. విశాఖపట్నం పోర్టు కేవలం 1.7 లక్షల టన్నుల బరువు ఉన్న స్టీమర్లను మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం మచిలిపట్నం ఏరియా అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. దీని పరిధి 426చ.కి.మీ. మంగినపూడి, గోపువానిపాలెం, పోతిపల్లి, చిలకలపూడి, కె అగ్రహారంలో భూసేకరణ చేస్తారు. దాదాపు 4500 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 2200 ఎకరాల ప్రైవేట్ భూమి కూడా ఉంది. భూసమీకరణ కింద భూమిని కోల్పోయే రైతులకు నష్టపరిహారం కూడా చెల్లించనున్నారు. కాగా మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పదివేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ భూమిలో పరిశ్రమలు రానున్నాయి. రేవుకు పరిసరాల్లో పారిశ్రామిక హబ్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ రేవు నిర్మాణం పూర్తయితే, ఆంధ్ర రాజధాని అమరావతికి 100 కి.మీ దూరంలో ఉంటుంది. అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు 370 కి.మీ దూరంలో ఉంటుంది.