ఆంధ్రప్రదేశ్‌

పంచాయతీలకు ఇక ఆర్థిక పరిపుష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 22: గవర్నమెంట్ రేటు ఆధారిత పన్ను మదింపు విధానాన్ని తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో త్వరలో అమలుచేయడానికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి ఉపకరించే పన్నుల సేకరణ ప్రక్రియను సమర్ధవంతంగా అమలుచేయడానికి గవర్నమెంట్ రేటు పన్ను మదింపు విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో ఈ విధానం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం విజయవంతంగా అమలుజరుగుతోంది. దీంతో తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఈ విధానాన్ని అమలుచేసే పనిలో అధికారులున్నారు. ఈ విధానం ద్వారా పన్నులను రివిజన్ చేయడంతో పాటు పంచాయతీల్లో మెరుగైన సేవలు అందించడానికి మార్గం సుగమం అవుతోంది. మెరుగైన రీతిలో పౌర సేవలను కల్పించినపుడు పన్నులు పెరిగినా ప్రజలు వ్యతిరేకించరని అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో భాగంగా జూన్ 1వ తేదీ నుండి జిల్లాలోని ఏజన్సీల పరిధిలోని పంచాయతీలు మినహా మిగిలిన అన్ని పంచాయతీల్లో పౌర సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించడానికి ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. జూన్ 1తరువాత వివిధ ధ్రువీకరణ పత్రాలను మాన్యువల్‌గా జారీ చేసే పంచాయతీ సెక్రటరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. జూన్ 20వ తేదీ నాటికి గ్రామ పంచాయతీల్లో జనన, మరణాల డేటాను పూర్తిగా కంప్యూటరీకరించనున్నారు. జిల్లాలో 1069 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించడం, పన్నుల సేకరణ, పౌర సేవల కల్పనకు ఇఒ పిఆర్‌డిలను ప్రత్యేక పర్యవేక్షకులుగా నియమించారు. వారు ఈ అంశాలపై క్రమం తప్పకుండా పంచాయతీ సెక్రటరీలతో సమావేశమవుతూ ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని ప్రభుత్వ యంత్రాంగం ఆదేశించింది. ప్రజలు సక్రమంగా పన్నులు చెల్లించేటపుడు తమకు అందాల్సిన సేవలపై కూడా నిలదీస్తారని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, ఒకవైపు మెరుగైన పౌర సేవలందిస్తూ, మరోవైపు నిర్దేశించిన లక్ష్యాల మేరకు పన్నులను వసూలు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. మేజర్ పంచాయతీలు, పంచాయతీల ద్వారా ప్రస్తుతం లభిస్తోన్న పన్నుల రాబడికి దీటుగా, గవర్నమెంట్ రేటు ఆధారిత పన్ను మధింపు ద్వారా ఆదాయం లభిస్తే అభివృద్ధి కూడా అదే స్థాయిలో ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విధానం ద్వారా జరిగే పన్నుల రివిజన్ ప్రక్రియను ఒక కొలిక్కి తెచ్చే పనిలో అధికారులున్నారు. వ్యర్థాలను రహదారి మార్జిన్లలో వేసే అనాగరిక సంప్రదాయాన్ని నిర్మూలించడం, ప్రజారోగ్యానికి భంగం కలిగించేవారిపై న్యూసెన్స్, క్రిమినల్ కేసులు నమోదు చేయడం వంటి బాధ్యతలను ఇఒ పిఆర్‌డిలకు ప్రభుత్వ యంత్రాంగం అప్పగించింది.

కలెక్టర్ల సమావేశం
ఒకరోజు వాయిదా
1న మంత్రివర్గ సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 22: ఈ నెల 24, 25 తేదీల్లో విజయవాడలో జరగాల్సి ఉన్న కలెక్టర్ల సమావేశాలు అనివార్య కారణాలతో 25, 26 తేదీలకు వాయిదాపడ్డాయి. అలాగే 26వ తేదీన జరగాల్సి ఉన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జూన్ ఒకటో తేదీకి వాయిదా పడింది.