ఆంధ్రప్రదేశ్‌

తెలుగు వర్శిటీకి మొండిచెయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, మే 22: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించిన ప్రభుత్వం తెలుగు భాష, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని విస్మరించటం పట్ల తెలుగు భాషాభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మామ, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మానసపుత్రికగా పేరొందిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పట్ల చంద్రబాబు చిన్నచూపు చూడటం పార్టీ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా విడుదల చేసిన జీవో నెం.32 ద్వారా రాష్ట్రంలోని 15 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని విస్మరించి మిగిలిన 14 విశ్వవిద్యాలయాల అభివృద్ధికి, వౌలిక సదుపాయాల కల్పనకు, బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు ప్రభుత్వం రూ.383.30 కోట్లు మంజూరు చేసింది. తెలుగుజాతి జీవనాడి అయిన కూచిపూడి నాట్యానికి ఉపాంగాలైన సంగీతం, భాష, తదితరాల అభివృద్ధికి కృషి చేసే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలో స్థానిక శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాపీఠం కూచిపూడి నాట్యం, సంగీతాభివృద్ధికి కృషి చేస్తోంది. రాజమండ్రిలో సాహిత్య పీఠం, శ్రీశైలంలో చరిత్ర, పరిశోధనల్లో విశేషంగా కృషి చేస్తోంది. ఇంతటి ప్రాచుర్యం పొందిన ఈ పీఠాలకు కేంద్రమైన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి కనీస నిధులు కూడా కేటాయించక పోవటం గమనార్హం. ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో శ్రీకాకుళంలోని డా. బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి రూ.33.45 కోట్లు, రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి రూ.45.28 కోట్లు, మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయానికి రూ.40.86 కోట్లు, నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి రూ.21.76 కోట్లు, కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయానికి రూ.48.20 కోట్లు, విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రూ.6.8 కోట్లు, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి రూ.7.2 కోట్లు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి రూ.33.9 కోట్లు, గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి రూ.20.5 కోట్లు, శ్రీకృష్ణ దేవరాయలు విశ్వవిద్యాలయానికి రూ.57.7 కోట్లు, కాకినాడ జెఎన్‌టియుకు రూ.15.30 కోట్లు, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయానికి రూ.14.90 కోట్లు, అనంతపురం జెఎన్‌యుకు రూ.37.40 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈవిధంగా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు కోట్లాది రూపాయలు కేటాయించిన ప్రభుత్వం తెలుగు భాష, సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఎలాంటి కేటాయింపులు జరపలేదు. 1104 మంది ప్రొఫెసర్లు, సహాయ ప్రొఫెసర్ల నియామకాలు, విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల అభివృద్ధి, గ్రంథాలయాల నిర్వహణ, ల్యాబ్‌లు ఏర్పాటు చేసి నాక్ గ్రేడ్ సాధనకు ఈ నిధులు వినియోగించేలా ప్రభుత్వం ఆదేశించింది. అయితే మనకు మాత్రం మొండిచేయి చూపటం తెలుగుజాతికే అగౌరవంగా భాషాభిమానులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.