ఆంధ్రప్రదేశ్‌

జలాల వినియోగంలో సర్దుబాటే మార్గం.. పట్టుబడితే ఘర్షణలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 22: జలాల వినియోగంలో మూడు రాష్ట్రాలు చర్చల ద్వారా సర్దుబాటు దోరణితో ముందుకుపోతే మంచిదని, లేనిపక్షంలో ఊహించని ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం కృష్ణా నదిపై ఎగువన నిర్మించతలపెట్టిన పాలమూరు, దిండి ఎత్తిపోతల పథకాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తుంగభద్ర నదిపై ఉన్న ఆర్డీఎస్ ఎత్తు పెంపు అంశం వివాదాస్పదంగా మారాయి. ఈ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని ఇందుకు మూడు రాష్ట్రాల నుంచి ప్రభుత్వాలు కమిటీలు వేసి పరిష్కార మార్గాలు అనే్వషిస్తే ప్రజల మధ్య జల యుద్ధాలను నివారించవచ్చని వారంటున్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి లభిస్తున్న జలాలను గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులను, క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. పంతాలకు పోతే ప్రజల మధ్య ఘర్షణలకు ఆస్కా రం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా కృష్ణా, తుంగభద్ర నదుల ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న ఎత్తిపోతల వివాదాన్ని పరిష్కరించడానికి వారు మార్గాలను సూచిస్తున్నారు. ఆర్డీఎస్ ఎత్తు పెంచాలన్న కర్ణాటక రాష్ట్ర నిర్ణయం ఫలితంగా కర్నూలు జిల్లాలోని సుమారు 400 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని ఎత్తు పెంచకుండా ఆర్డీఎస్ నీటిని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఆర్డీఎస్ వద్ద నీటి వినియోగంపై ఇప్పటికే ట్రిబ్యునల్ తీర్పును అమలు చేస్తే సమస్య పరిష్కారమవుతుందని సూచిస్తున్నారు. అవసరమైతే మూడు రాష్ట్రాల నిపుణుల కమిటీ పరిశీలన అనంతరం ఎత్తు పెంపుపై నిర్ణయం తీసుకోవాలంటున్నారు. శ్రీశైలం జలాశయానికి గత పదేళ్ల కాలంలో సగటున ప్రతి ఏటా 590 నుంచి 600 టిఎంసిల నీరు వచ్చి చేరుతోందని రికార్డుల ద్వారా తెలుస్తోందని పేర్కొంటున్నారు. ఇందులో కృష్ణా నది నుంచి సుమారు 350 టిఎంసిలు కాగా తుంగభద్ర నుంచి సుమారు 255 టిఎంసిల నీరు వచ్చి చేరుతోందని వెల్లడిస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు, దిండి ఎత్తిపోతల పథకాల ద్వారా ప్రతి ఏటా 120 టిఎంసిల కృష్ణా జలాలను వినియోగించుకోవాలని పథకాలను సిద్ధం చేసి నిర్మాణాలకు శంకుస్థాపన చేసింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయగా వివాదం రాజుకుంది. అయితే దీన్ని వివాదాస్పదం చేయకుండా ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు సామరస్య ధోరణిలో పరిష్కరించుకోవచ్చని వారంటున్నారు. తుంగభద్ర నుంచి లభ్యమవుతున్న 255 టిఎంసిల నీటిని పూర్తి స్థాయిలో తెలంగాణ, ఏపి ప్రభుత్వాలు వినియోగించుకోగలితే కృష్ణా జలాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని వెల్లడిస్తున్నారు.
తుంగభద్ర జలాలను సద్వినియోగం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏపి సర్కారుకు సహకరించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. తుంగభద్ర నదికి సమాంతరంగా కాలువను నిర్మించుకోవడం, గుండ్రేవుల వద్ద 20 టిఎంసిల నిల్వ సామర్థ్యంతో జలాశయ నిర్మాణం, ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణాలకు తెలంగాణ ప్రభుత్వం తన వంతు సహకారం అందించడం, ఎల్లెల్సీ సమస్యపై రెండు ప్రభుత్వాలు కర్ణాటకపై వత్తిడి తీసుకురావాలని పేర్కొంటున్నారు. మరోవైపు ఆర్డీఎస్ ఎడమ కాలువ ద్వారా తెలంగాణ ప్రభుత్వం తన వంతు వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి అవసరమైన ప్రాజెక్టులకు ఏపి అభ్యంతరం వ్యక్తం చేయకుండా ఉంటే తుంగభద్ర జలాల్లో నికర, వరద జలాలను పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, తెలంగాణలోని పాలమూరు, నల్గొండ జిల్లాలకు కలిపి 150 టిఎంసిల వరకూ సర్దుబాటు చేసుకోవాలని పేర్కొంటున్నారు.
ఇక కృష్ణా నదిపై పాలమూరు, దిండి ఎత్తిపోతల పథకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం 120 టిఎంసిల నీటిని వినియోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నికర జలాలతో పాటు మరో 240 టిఎంసిల కృష్ణా జలాలు లభ్యమవుతాయని, తుంగభద్ర జలాల్లో సుమారు 100 టిఎంసిల నీరు కలిపి సుమారు 340 టిఎంసిల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతాయని వారంటున్నారు. ఈ నీటిలో పోతిరెడ్డిపాడు ద్వారా 100 టిఎంసిల నీరు వినియోగించుకుంటే మరో 240 టిఎంసిల నీరు విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించవచ్చు అంటున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటే సమస్యను పరిష్కరించవచ్చని వెల్లడిస్తున్నారు. అంతేగాకుండా తుంగభద్ర, కృష్ణా జలాలను కాలవలు, జలాశయాలకు తరలించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలను అత్యధికంగా నిల్వ చేయవచ్చని వెల్లడిస్తున్నారు. మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు పంతాలకు పోకుండా పరిష్కార మార్గాలను అధ్యయనం చేయాలని వారు అభిప్రాయపడుతున్నారు.