ఆంధ్రప్రదేశ్‌

25వేలు పలికిన మూడు పులసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడియం, మే 22: ‘పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే’ అనే సామెత ఊరికే వచ్చినట్టు లేదు. ఎందుకంటే మూడు పులస చేపలు ఏకంగా 25వేలకు అమ్ముడు బోయాయ. వరదల సమయంలో మాత్రమే లభించే ఈ పులసలు ఆదివారం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మత్స్యకారులకు చిక్కాయి. రెనో తుపాను ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఆనకట్ట దిగువన ఉన్న నీటి నుండి కొన్ని చేపలు లభించినట్టు మత్స్యకారులు చెబుతున్నారు. వరదల సమయంలో విలసలు సముద్రం నుండి గోదావరిలోకి ఎదురీది పులసలుగా మారుతాయి. కొన్ని వందల కిలోమీటర్లు అతివేగంగా ఈ చేపలు ప్రయాణిస్తాయి. ఈ చేప వలకు చిక్కిన వెంటనే మరణిస్తాయి. బతికున్న పులసను చూడడం చాలా అరుదు. ఈ చేపంటే గోదావరి జిల్లా వాసులు రొట్టలు వేసుకుంటారు. ఈ సీజన్లో ఖరీదైన ఈ చేపను కొనుగోలుచేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులకు, బంధువులకు, రాజకీయ నేతలకు వీటిని కానుకలుగా సమర్పిస్తుంటారు. అయితే అరుదైన సమయంలో లభించిన ఈ పులసలను కడియంకు చెందిన టిడిపి నేత వెలుగుబంటి ప్రసాదు కొనుగోలు చేశారు. మూడు పులసలు రూ.25వేలకు కొనుగోలుచేసి, సన్నిహితులకు విందు ఇచ్చారు.

అంతర్వేదికి కొట్టుకుపోయన
నిజాంపట్నం చేపల బోటు!
తీరంలో తిరగబడిన నావ
ఆరుగురిని రక్షించిన పోలీసులు
ఆచూకీ చిక్కని ఓ మత్స్యకారుడు
మలికిపురం, మే 22: గుంటూరు జిల్లా నిజాంపట్నం నుండి ఈ నెల 17న వేటకు బయలుదేరి, సముద్రంలో తుపానులో చిక్కుకుని దారితప్పిన బోటు ఆదివారం తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ప్రత్యక్షమయ్యింది. అయితే బోటు తీరానికి వచ్చిన తరువాత దురదృష్టవశాత్తు తిరగబడటంతో మన్నం ఏసురత్నం (65) అనే వ్యక్తి సముద్రంలో గల్లంతయ్యాడు. బోటులో ఉన్న పి నాగమల్లేశ్వరరావు, గొప్పాడి రవి, పీతా వెంకటేశ్వరరావు, నీలం బాబూరావు, సున్నంపూడి మగదార్య, చెన్ను రవి అనే వ్యక్తులను సఖినేటిపల్లి ఎస్‌ఐ కృష్ణ్భగవాన్ నేతృత్వంలో పోలీసులు సురక్షితంగా గట్టుకు చేర్చగలిగారు. గల్లంతైన ఏసురత్నం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 17వ తేదీన బయలుదేరిన వీరు తుపానులో చిక్కుకుని, గమ్యం తెలియక సముద్రంలో తిరుగుతుండటంతో వారి వద్దనున్న సెల్‌ఫోన్స్ ఆధారంగా సమాచారం తెలుసుకున్న నిజాంపట్నం పోలీసులు తూర్పు గోదావరి జిల్లా పోలీసులకు సమాచారం అందించడంతో వారిని రక్షించగలిగారు.