తెలంగాణ

డిఎస్సీ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: ఉపాధ్యాయుల భర్తీలో జిల్లాస్థాయి నియామకాల వ్యవస్థను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య బుధవారం జీవో 19 జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో డి.ఎస్సీ ద్వారా జరగాల్సిన ఉపాధ్యాయ నియామకాలు ఇకపై తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా చేపడతారు. డి.ఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్న సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను టిఎస్‌పిఎస్సీ ద్వారానే భర్తీ చేస్తారు. రెసిడెన్షియల్ స్కూళ్లలోని పిజిటి, టిజిటి పోస్టులను కూడా కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాల భర్తీతో పాటు ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల భర్తీని సైతం టిఎస్‌పిఎస్సీ ద్వారానే చేపట్టనున్నారు. డి.ఎస్సీ ద్వారా చేపట్టే నియామకాల్లో కొంత ఏకరూపత, అసంబద్ధత నెలకొంటోందని, జిల్లాస్థాయి నియామకాలు ద్వారా గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయని భావించిన ప్రభుత్వం పోటీ పరీక్షల నిర్వహణ, ప్రతిభావంతుల జాబితా తయారీ, ఉపాధ్యాయ ఎంపిక బాధ్యతలను టిఎస్‌పిఎస్సీకి అప్పగించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వం ప్రతిపాదించిన 10వేల ఉపాధ్యాయుల భర్తీకి త్వరలో టిఎస్‌పిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. వారం క్రితం ప్రత్యక్ష నియామకాలను రద్దు చేసి, వాటిని పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా చేపట్టడానికి ఎంత వరకూ వీలవుతుందో పరిశీలించాలని జిఎడి అధికారులను కోరారు. దాంతో అనుకూలమైన స్పందన రావడంతో తెలంగాణ పాఠశాల విద్య డైరెక్టర్ పరిధిలోని అన్ని రకాల టీచర్ పోస్టులను ప్రత్యక్ష నియామక పద్ధతి నుండి తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అన్ని రకాల ఖాళీలూ కమిషన్ ద్వారానే
రానున్న రోజుల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఖాళీలను సైతం పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్టీసీ , మున్సిపల్ శాఖల్లో చేపట్టబోయే నియామకాలు సైతం కమిషన్ పరిధిలోకి వస్తాయి.
తగ్గనున్న కేసులు
టీచర్ల రిక్రూట్‌మెంట్‌లపై అన్ని జిల్లాల్లో కలిపి దాదాపు రెండు వేల కేసులు వివిధ స్థాయిల్లో న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి. ప్రధానంగా రోస్టర్ రిజర్వేషన్లు, పోస్టుల సంఖ్య, డైరెక్టు రిక్రూట్‌మెంట్ తదితర అంశాలపై ఈ కేసులు దాఖలయ్యాయి.
చివరికి ఎంపిక జాబితాల బాధ్యత కలెక్టర్లకే
పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా టీచర్లను ఎంపిక చేసినా, చివరికి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేది మాత్రం ఆయా జిల్లాల కలెక్టర్లే. రోస్టర్లు ముందు ఖరారు చేసేది కూడా కలెక్టర్లే, దానిని పబ్లిక్ సర్వీసు కమిషన్ నోటిఫై చేసినా వ్యవహారం అంతా జరిగేది మాత్రం కలెక్టర్ల ద్వారానే నని చెబుతున్నారు.
నోటిఫికేషన్ ఇవ్వండి: యుటిఎఫ్
డి.ఎస్సీని రద్దు చేసిన క్రమంలో తక్షణమే టీచర్ల రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎ నర్సిరెడ్డి, ప్రధానకార్యదరిశ చావ రవి డిమాండ్ చేశారు. 1984 నుండి రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీ నిర్వహిస్తున్నారని, రాత పరీక్ష నిర్వహించే సంస్థ మారినా వ్యవహారం మాత్రం జిల్లాల వారీ చేయాల్సిందే కనుక పద్ధతిలో పెద్ద మార్పేమీ ఉండదని వారు పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో దాదాపు 17వేల పోస్టులు ఖాళీ అయ్యాయని, వాటిని తక్షణమే భర్తీ చేయకపోతే ప్రభుత్వ స్కూళ్లు మనుగడ కష్టంగా మారిందని పేర్కొన్నారు.