తెలంగాణ

సినిమాల పైరసీకి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: సినిమా పైరసీని అరికట్టేందుకు తెలంగాణ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్ యూనిట్ (టిఐపిసియు)ను ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. ఈ మేరకు విధి విధానాలతో జీవోను జారీ చేస్తారు. సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో ప్రత్యేకంగా ఒక సెల్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. దేశంలో ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేయడం తొలిసారి అని ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, హోం, ఆర్థిక శాఖలు ఇప్పటికే ఈ సెల్ ఏర్పాటుకు క్లియరెన్సు ఇచ్చాయి. టిఐపిసియు సైబర్ క్రైమ్ సెల్‌లో భాగంగా ఉంటుందన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ పైరసీ వల్ల నిరుడు రూ.300 కోట్లకు పైగా నష్టాలను చవి చూసిందన్నారు. పైన పేర్కొన్న ప్రతిపాదనలతో కూడిన నివేదికను ముఖ్యమంత్రి క్లియరెన్సు కోసం పంపించనున్నారు. తెలంగాణ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్ యూనిట్‌కు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు హోదాలో ఉన్న అధికారిని నియమిస్తారు. ఈ అధికారి ఆధ్వర్యంలో ఐటి నైపుణ్యం ఉన్న సిబ్బంది ఉంటారు. వీరు పైరేట్ సైట్లను గుర్తించి బ్లాక్ చేస్తారు. అనంతరం ఇందుకు బాధ్యులైన వారిని ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం గుర్తించి చర్యలు తీసుకుంటారు. ఈ సెల్ ఏర్పాటుకు ఐటి చట్టానికి సవరణలు తీసుకురావాల్సి ఉంటుంది.
రూ.10 కోట్ల కొకైన్ పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో మాదకద్రవ్యాల స్మగ్లింగ్
శంషాబాద్, మే 17: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ నుంచి రూ.10కోట్లు విలువ చేసే కొకైన్ మత్తు పదార్థాన్ని డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం దుబాయి నుంచి ఓ మహిళ రూ.10కోట్ల విలువైన కొకైన్ మత్తు పదార్థాలను తీసుకొని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీ నిర్వహించగా పుస్తకం సైడ్ గొట్టాలలో రెండు కిలోల కొకైన్ ఉన్నట్లు గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి డిఆర్‌ఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. కొకైన్‌ను స్వాధీనం చేసుకొని మహిళను విచారణ నిమిత్తం నగరంలోని కార్యాలయానికి తరలించారు.
ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌కు
హెచ్‌సియు అసోసియేట్ ప్రొఫెసర్
ఎంఐటిలో మీడియా స్టడీస్‌పై అవకాశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 17: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సియు)కి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉషారామన్ ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. మసూచుసెట్స్‌లోని ఎంఐటిలో మీడియా స్టడీస్‌పై ప్రాజెక్టు చేసేందుకు ఆమె అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఆమె ఆగస్టు నుండి డిసెంబర్ వరకూ ఎంఐటికి హాజరవుతారు.