జాతీయ వార్తలు

పిఎంఓ ప్రతీకార చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ప్రధాన మంత్రి కార్యాలయం రాజకీయ ప్రతీకార చర్యల మూలంగానే తమపై నేషనల్ హెరాల్డ్ కేసులు పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రాహుల్ గాంధీ బుధవారం పార్లమెంటు ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసు నూటికి నూరు శాతం ప్రధాన మంత్రి రాజకీయ ప్రతీకారమేనని ఆరోపించారు. తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉన్నదని ఆయన ఆ వెంటనే ప్రకటించారు. నేషనల్ హెరాల్డ్ కేసును విచారిస్తున్న కోర్టును భయపట్టేందుకు కాంగ్రెస్ పార్లమెంటు ఉభయ సభలను ఉపయోగించుకుంటోందనే ఆరోపణలను రాహుల్ గాంధీ ఖండించారు. వాస్తవానికి తమను బెదిరించేందుకే పార్లమెంటును దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆయన అధికార పక్షంపై మండిపడ్డారు. ఈ కేసులో చివరకు న్యాయం వెలుగులోకి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థను బెదిరించేందుకు కాంగ్రెస్ పార్లమెంటును ఉపయోగించుకుంటోందంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చేసిన ఆరోపణలను ఆయన దృష్టికి తీసుకురాగా న్యాయ వ్యవస్థను ఎవరు భయపెట్టిస్తున్నారనేది అందరికి తెలిసిందేనని రాహుల్ గాంధీ అన్నారు.