తెలంగాణ

పిఎస్‌సికి బ్రోకర్ల బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: దేశంలోనే అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా రిక్రూట్‌మెంట్‌లు నిర్వహించే కమిషన్‌గా ఖ్యాతి గడించిన తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు బ్రోకర్ల బెడద పట్టుకుంది. తమకు ఎవరూ తెలియకున్నా, ఫలానా మెంబర్ తమకు తెలుసు, ఉద్యోగాలు ఇప్పిస్తాం, చైర్మన్ తెలుసు మీకు ఇంటర్వ్యూలో మార్కులు ఇప్పిస్తాం అంటూ బ్రోకర్ల దందా మొదలైంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌లోనే అభ్యర్ధులకు కమిషన్‌కు తెలియకుండా కొంత మంది సభ్యులు నిరుద్యోగులను పిలిచి బోర్డు ఛాంబర్లలో ఇంటర్వ్యూలు నిర్వహించి డబ్బులు దోచుకున్నారు, అభ్యర్ధులు అవన్నీ నిజమైన ఇంటర్వ్యూలు అని భావించారు, తీరా చూస్తే రహస్యంగా నిర్వహించిన నకిలీ ఇంటర్వ్యూలని తేలింది. ఆ తర్వాత పోలీసు కేసులు, దర్యాప్తులు, అరెస్టుల వరకూ వెళ్లింది, అయినా బ్రోకర్ల మాటల మాయాజాలంలో పడుతున్న అభ్యర్ధులు అంతా తమకేదో మేలు జరుగుతుందని భ్రమపడుతున్నారు. తొలి రిక్రూట్‌మెంట్ నిర్వహించిన రోజునే కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి చాలా స్పష్టంగా ఎక్కడా ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా దరఖాస్తు చేయడానికి ముందు రిజిస్ట్రేషన్ దశ నుండి ఫలితాల వరకూ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నామని చెప్పారు.
దీనివల్ల దాదాపు అవినీతిని పూర్తిగా నిర్మూలించగలిగామని, కమిషన్‌లో అక్రమాలకు, అవినీతికి ఎలాంటి తావులేదని అంతా పారదర్శకంగా జరుగుతున్నా బ్రోకర్లు సొమ్ము చేసుకునేందుకు కొన్ని మాటలు చెబుతుంటారని అలాంటి సమాచారం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. కమిషన్ వెబ్‌సైట్ టిఎస్‌పిఎస్‌సి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌లో విజిలెన్స్ ఎట్‌ద రేట్ ఆఫ్ టిఎస్‌పిఎస్‌సి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్ మెయిల్ ఐడి ఉంటుందని, దానికి అభ్యర్ధులు ఫిర్యాదులు చేయవచ్చని అన్నారు. నిరుద్యోగులు ప్రలోభాలు పెట్టే వారి మాటలు వినొద్దని, తప్పుడు హామీలు ఇస్తుంటారని, కమిషన్ చాలా నిజాయితీగా పనిచేస్తుందని, నిజమైన అభ్యర్ధులను ఎంపిక చేయడమే లక్ష్యంగా కమిషన్ పనిచేస్తుందని కార్యదర్శి పేర్కొన్నారు. అలాగే పరీక్షలను కూడా చాలా పకడ్బందీగా నిర్వహించడం ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ కమిషన్ ఖ్యాతి గడించిందని, విజయవంతంగా ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్‌లను నిర్వహించగలిగామని పేర్కొన్నారు. ఎప్పటికపుడు అభ్యర్ధులకు మొబైల్ ఎస్‌ఎంఎస్‌లను పంపుతోందని దాని వల్ల సమాచారం లేమి అనేది లేకుండా చూస్తున్నామని పార్వతి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఎవరైనా ఎలాంటి సమాచారం అయినా కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని అభ్యర్ధుల వివరాలను గోప్యంగా ఉంచి దర్యాప్తు నిర్వహిస్తామని ఆమె చెప్పారు.

పీర్జాదిగూడ మున్సిపాలిటీ
ఏర్పాటు జీవోపై స్టే
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 13: పీర్జాదిగూడ, పర్వతాపూర్, మేడిపల్లి పంచాయతీలను కలిపి పీర్జాదిగూడ మున్సిపాలిటీగా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జివోను తాత్కాలికంగా హైకోర్టు నిలిపివేసింది. నియమ నిబంధనలను పట్టించుకోకుండా ప్రభుత్వం జివో జారీ చేసిందని ఆరోపిస్తూ ఎంపిటిసిలు డి.ప్రభాకర్‌రెడ్డి, డి.చంద్రకళలు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. పిటీషనర్ల వాదన విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.
కెఎల్ వర్శిటీలో 100 శాతం ప్లేస్‌మెంట్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 13: విజయవాడ కెఎల్ విశ్వవిద్యాలయంలో ఎంబిఏ చేసిన 2014-16 బ్యాచ్ అభ్యర్థులు నూటికి నూరుశాతం ప్లేస్‌మెంట్ పొందారని ఆ యూనివర్శిటీ వర్గాలు తెలిపాయి. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, జనలక్ష్మీ ఫైనాన్సియల్ సర్వీసెస్, యాక్సిసె బ్యాంకులు ఎంబిఏ విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కల్పించాయని తెలిపారు. కెఎల్ విశ్వవిద్యాలయం, టైమ్స్ ప్రో గ్రూప్‌తో కలిసి ఈ ఎంబిఏ కోర్సును ఆఫర్ చేశాయి.