తెలంగాణ

కాళ్ల పారాణి ఆరకముందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూత్పూర్, మే 13: ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉద్యోగం చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగం కోసం మహబూబ్‌నగర్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మార్గమధ్యలో రహదారిపై లారీ ఢీకొని కొత్త దంపతులు మృత్యువాత గురైన సంఘటన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని అమిస్తాపూర్ సమీపంలో జరిగింది. ఎస్సై అశోక్ కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ నుంచి భూత్పూర్ వైపునకు గొర్రెల లోడ్‌తో వస్తున్న లారీ అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొని ఎదురుగా వస్తున్న డీసీఎంను కొట్టి, డీసీఎం వెనుక వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో వాహనంపై ఉన్న కెటీ రవికుమార్ (30) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ అతని భార్య శ్రీలత (25) చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని ఎస్సై తెలిపారు. వనపర్తి పట్టణానికి చెందిన కె.టి రవికుమార్ రోహిత్ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడని, భార్య శ్రీలత ప్రగతి నర్సింగ్‌హోమ్‌లో స్ట్ఫా నర్సుగా విధులు నిర్వహిస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వివాహం అయిన నెలరోజులకే మృత్యువాతపడడంతో వనపర్తిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

‘గ్రిడ్’ పనుల్లో జాప్యమేల?
అధికారులపై స్మితా సబర్వాల్ తీవ్ర అసంతృప్తి
వర్షాకాలానికి ముందే పైపులైన్ పూర్తిచేయాలని ఆదేశం

పరకాల, మే 13: నెల రోజుల క్రితమే పనులు పూర్తికావాలని... ఎందుకు కాలేదు అంటూ అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్‌ను ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి స్మితాసభర్వాల్, వాటర్ గ్రిడ్ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం జోగంపల్లిలోని చలివాగులో నిర్మిస్తున్న ఇంటెక్ట్ పనులను వారు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనులపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటెక్ట్‌లో ఇంకా 16 మీటర్ల పనులు ఎప్పుడు పూర్తిచేస్తారని ప్రశ్నించారు. అయితే లేబర్ సమస్య ఉందని వారి దృష్టికి తీసుకురాగా, అది మీ సమస్య అనీ, దానిని మీరు చూసుకోవాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సమీక్ష జరిపినా పనుల పురోగతిలో మార్పు ఎందుకు లేదన్నారు. మిషన్ భగీరథ పర్యవేక్షణలో ముఖ్యమంత్రి తరువాత స్థానంలో ఉన్న ముగ్గురు వచ్చామన్నారు. ఈనెల 16న కలెక్టర్ ఆర్డిఓను పంపుతారని అప్పటివరకు డ్రాఫ్ట్ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. అదేవిధంగా జూన్ 5లోపు పనులు పూర్తిచేయాలని వారు కాంట్రాక్టర్‌కు సూచించారు. డబుల్ షిఫ్ట్‌లు ఏర్పాటుచేసి పనులు పూర్తిచేయాలన్నారు. పైపులైన్ పనులపై దృష్టి పెట్టాలని వారు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి సూచించారు. ఇంటెక్ట్ పనులు వేగవంతం చేయాలని లేనియెడల సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు. శివశంకర్‌ను హైదరాబాద్‌లోని సిఎంఓ కార్యాలయానికి రావాలని ఆదేశించారు.
అనంతరం కలెక్టర్ కరుణ మాట్లాడుతూ సమీక్షా సమావేశం ఎప్పుడు జరిగినా పనులు వేగవంతం చేస్తున్నట్లు తమ దృష్టికి తీసుకువస్తున్నారని ఇక్కడ పనులు చూస్తే మరోలా ఉన్నాయన్నారు. మరోసారి సమీక్ష నిర్వహించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా సిఇ, ఇఇ కూడా పనులను పర్యవేక్షించాలన్నారు. వారి వెంట సంబంధిత శాఖాధికారులు, టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

‘పాల’మూరు..

‘పాడి’లో పరుగు

పాల ఉత్పత్తిలో రాష్ట్రంలోనే ప్రథమం... కరవులోనూ తగ్గని వైనం
ప్రతిరోజూ 8 లక్షల లీటర్ల ఉత్పత్తి.. హైదరాబాద్‌కు 5 లక్షల లీటర్లు
జిల్లాలో 8.24 లక్షల గోజాతి పశువులు 4.14 లక్షల గేదెజాతి పశు పోషణ

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, మే 13: పాల దిగుబడికి నిలయంగా పేరున్న పాలమూరు జిల్లా పాల ఉత్పత్తిలో మరోసారి పరుగులు తీస్తోంది. ప్రతియేటా పాల ఉత్పత్తి మరింత పెరుగుతూ ఇతర రాష్ట్రాలకు సైతం పాలమూరు పాడి రైతులు పాలను సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వాలు సైతం పాలమూరు పాలకు ప్రచారమివ్వడం అందుకు నిదర్శనం. నాటి నుండి నేటి వరకు అసలు పాలమూరు అనే పదానికి అర్థం పాలు, పెరుగు. ప్రస్తుత తీవ్ర కరవు పరిస్థితుల్లో సైతం మహబూబ్‌నగర్ జిల్లాలో పాలకు మాత్రం కొదవలేదు. రాష్ట్రంలోనే పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అధికారికంగా ప్రతిరోజు జిల్లాలో ఎనిమిది లక్షల లీటర్ల పాల ఉత్పత్తి కొనసాగుతోంది. ఇందులో తెలంగాణ పాల అభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతిరోజు అధికారికంగా 2 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుండగా వివిధ ప్రైవేట్ సంస్థలు మరో 3 లక్షలకు పైగా పాల సేకరణ జరుపుతున్నాయ. అంతేకాకుండా జిల్లా ప్రజల అవసరాల నిమిత్తం పాడి రైతులు నేరుగా జిల్లాలో విక్రయించుకుంటున్న పాలు దాదాపు రెండు లక్షలకు పైగానే ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. మరో లక్ష లీటర్లు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా అవుతోంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లే పాలు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన మక్తల్, నారాయణపేట, కొడంగల్, గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలోని వివిధ మండలాలకు చెంచిన రైతులు అక్కడి ఏజెన్సీలకు పాలను అమ్ముకుంటున్నారు. దీంతో పాలమూరు పాలు కర్నూల్, రాయిచూర్, గుల్బర్గ, యాద్‌గిరి జిల్లాలకు సరఫరా అవుతున్నాయ. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉత్పత్తి అయిన పాలలో ఎక్కువ శాతం హైదరాబాద్‌కు సరఫరా అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పాల అభివృద్ధి సమాఖ్య, వివిధ ప్రైవేట్ సంస్థలు సేకరించిన దాదాపు 5 లక్షలకు పైగా లీటర్ల పాలు హైదరాబాద్‌కే సరఫరా అవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంత పెద్దమొత్తంలో పాల ఉత్పత్తికి ప్రధాన కారణం జిల్లాలో గోజాతి, గేదె జాతి పశువులు అధికంగా ఉండడమే. మహబూబ్‌నగర్ జిల్లాలో గోజాతి దాదాపు 8,24,326 పశువులు ఉండగా అదేవిధంగా గేదెజాతికి సంబంధించి 4,14,370 పశువులు ఉన్నాయి. వీటిద్వారా జిల్లాలో దాదాపు 8 లక్షల లీటర్లకు పైగా పాల ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం పాల ధర కూడా బాగానే ఉంది. కనీస మద్దతు ధర ఆవు పాలకు రూ.27 ఉండగా, గేదెపాలకు రూ.30 ధర ఉంది. అయితే ప్రస్తుతం పాలల్లో అధిక కొవ్వు 10.5 శాతం ఉన్నట్లు మీటర్ ద్వారా తేలితే అట్టి పాలకు మాత్రం రూ.55 ధర పలుకుతోంది. అయితే జిల్లాలో కరవులో సైతం పాల ఉత్పత్తి తగ్గకుండా ప్రభుత్వం పాడి రైతులకు అండగా నిలిచింది. జిల్లాకు ఏకంగా 3200 మెట్రిక్ టన్నుల దాణాను సబ్సిడీపై మంజూరు చేసింది. 50 శాతం సబ్సిడీతో ఇస్తుండడంతో రైతులకు ఊరట లభించింది. అంతేకాకుండా 750 మెట్రిక్ టన్నుల పశుగ్రాసాన్ని కూడా సరఫరా చేస్తోంది. అయితే పశుగ్రాసం మాత్రం పూర్తిగా సబ్సిడీపైనే ఇస్తున్నారు. ఉచిత పశు పోషణ శిబిరాలను సైతం ఏర్పాటు చేశారు. దాంతో జిల్లాలోని 2,180 పాడి పశువులకు పశు పోషణ శిబిరాల ద్వారా పశు గ్రాసం అందుతోంది. నిరుద్యోగ యువత సైతం జిల్లాలో పాడి పశువులను అధికంగా పోషిస్తూ పాల ఉత్పత్తిపై జీవనోపాధి పొందుతుండడంతో పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని చెప్పవచ్చు.
రవాణా సౌకర్యం వల్లే అధిక ఉత్పత్తి
జిల్లా అధికారి సుధాకర్
రైతులకు వ్యవసాయం అనుకూలంగా లేని పరిస్థితి, తీవ్ర కరవు రావడంతో ఇబ్బందులు ఉన్న నేపథ్యంతో ప్రత్యామ్నాయంగా రోజువారి ఆదాయంపై దృష్టి సారించారని జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి సుధాకర్ తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాకు సమీపంలోనే ఉండడంతో పాలు అధికంగా ప్రభుత్వపరంగా సేకరించి పాలు మొత్తం అటువైపు సరఫరా చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం సైతం పాడి రైతుకు అండగా నిలిచిందని, లీటరుకు రూ. 4 అదనంగా ఇవ్వడంతో పాల ఉత్పత్తికి మరింత చేయూత లభించిందని అన్నారు. రాష్ట్రంలోనే పాలమూరు జిల్లా పాల ఉత్పత్తిలో ప్రథమంలో ఉందని తెలిపారు.

విజయడైరీలో పాలను పోస్తున్న రైతులు