తెలంగాణ

కాంగ్రెస్ అడ్డుకున్నా కాళేశ్వరం కడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, మే 13: కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిన కాళేశ్వరం బ్యారేజిని నిర్మించి తీరుతామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. వరంగల్ జిల్లానర్సంపేట మండలంలోని మాధన్నపేట పెద్ద చెరువుపై రెండవ విడత మిషన్‌కాకతీయ పనులకు సంబంధించిన భారీ పైలాన్, మినీట్యాంక్ బండ్‌ను శుక్రవారం రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి అజ్మీర చందూలాల్, మహబూబాబాద్ ఎంపి అజ్మీర సీతారాంనాయక్‌లతో కలిసి మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ కాళేశ్వరం బ్యారేజికి వ్యతిరేకంగా మహరాష్ట్ర కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు చేస్తోందని.. ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులు నిర్మించాలని అంటున్నారని చెప్పారు. పాలమూరు వద్ద కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆందోళనలు నిర్వహిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులది పూటకోమాట, ఊరుకో మాట అన్న చందంగా మారిందని విమర్శించారు. పదేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందని, పంట పొలాలకు సాగునీరు అందించలేదని ధ్వజమెత్తారు. దేవాదుల నీటిని వరంగల్ జిల్లాకు తీసుకొచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, ఇటీవల ఢిల్లీకి వెళ్లి పిఎం కెఎస్ వైలో దేవాదుల ప్రాజెక్టును చేర్చామని వెల్లడించారు. దేవాదుల ప్రాజెక్టుకు రూ. 2వేల కోట్లు మంజూరీ ఇవ్వాలని కోరామని తెలిపారు. పాఖాలకు గోదావరి జలాలను మళ్లించి వచ్చే సంవత్సరం రబీ పంటకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని చెప్పారు. పాఖాల చెరువు పునరుద్ధరణకు త్వరలోనే ఉన్నత స్థాయి సాగునీటి పారుదల శాఖ అధికారులను పంపించి రీ డిజైనింగ్ చేసి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి, వరంగల్ నగర మేయర్ నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

మాదన్నపేట పెద్ద చెరువుపై భారీ పైలాన్‌ను ప్రారంభిస్తున్న మంత్రి తన్నీరు హరీశ్‌రావు