తెలంగాణ

మీ ప్రాజెక్టులకు ఎవరి అనుమతి ఉంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 3: అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తుందంటున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ కానీ, ఆ ప్రాంత నేతలు కానీ హంద్రినీవా, గాలేరు, వెలిగొండ ప్రాజెక్టులను ఎవరి అనుమతితో కట్టారో సమాధానం చెప్పాలని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు మంగళవారం డిమాండ్ చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? వాడుకున్నదెంత? అని ఆయన ప్రశ్నించారు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తీర్మానం, అక్కడి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు భూమి పూజ చేసుకుని తెలంగాణ ప్రజలు సంబరపడుతుంటే చూసి ఓర్వలేని ఆంధ్రనేతలు కండ్లమంటతో వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చేసిన తీర్మానం చెల్లని రూపాయిగా మంత్రి హరీశ్‌రావు అభివర్ణించారు. ‘అక్రమ ప్రాజెక్టులను కట్టుకున్నది మీరు, జలదోపిడి చేసింది మీరు, శ్రీశైలం రిజర్వాయర్‌కు దొంగ తూములు పెట్టింది మీరు, గోదావరిని అన్యాయంగా కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నది మీరు, తెలంగాణను ఎండబెట్టింది మీరు, పాలమూరు రైతుల ఉసురు పోసుకున్నది మీరు, నల్లగొండ ఫ్లోరైడ్‌కు కారకులు మీరు’ అని హరీశ్‌రావు ఆరోపించారు. ‘తెలంగాణలో కట్టే ప్రాజెక్టులకు అనుమతులను ప్రశ్నిస్తున్న మీరు, ఎవరి అనుమతి తీసుకుని పట్టిసీమ కట్టిండ్రు? ఎవరి అనుమతి తీసుకుని పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచిండ్రు? అని మంత్రి అడిగారు. కృష్ణానదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టిఎంసిల నికర జలాలు కేటాయింపులు ఉండగా, అందులో 299 టిఎంసిలతో తెలంగాణ ప్రాజెక్టులు, 512 టిఎంసిలతో ఆంధ్ర ప్రాజెక్టులు ఉన్నట్టు ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రభుత్వం ప్రకటించగా మా వాటా 299 కాదు, 376 టిఎంసిలు అని ఉద్యమ సమయంలోనే చెప్పామన్నారు. తమ వాటాకు లోబడి ప్రాజెక్టులు నిర్మించుకుంటుండగా తమపై ఎందుకు బురద జల్లుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్టులకు చేస్తున్న రీ-డిజైనింగ్ కూడా మాకు కేటాయించిన తమ వాటాకు లోబడే చేసుకున్నామని మంత్రి గుర్తు చేశారు.