ఆంధ్రప్రదేశ్‌

అదిగో.. ఇదిగో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 3: రాష్ట్రంలో ఐఎఎస్, ఐపిఎస్‌లను బదిలీ చేయాలని ప్రభుత్వం దీర్ఘకాలంగా కసరత్తు ఇప్పటికీ ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపించడం లేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐఎఎస్, ఐపిఎస్‌లను చంద్రబాబు నియమించారు. ఆ తరువాత ఒకరిద్దరికి స్థానం చలనం కల్పించారు. మిగిలిన వారంతా రెండేళ్ళ నుంచి దాదాపూ అదే పదవుల్లో కొనసాగుతున్నారు. కొంతమంది ఐఎఎస్‌లకైతే అదనపు శాఖలను కూడా అప్పగిస్తున్న దాఖలాలు ఉన్నాయి. రాష్ట్రంలో15 మంది ఐఎఎస్‌లను, 20 మంది ఐపిఎస్‌లను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడానికి కొన్ని వత్తిడులు అడ్డుపడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొంతమంది ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లపై ఆరోపణలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. కొంతమంది ఐఎఎస్ అధికారులపై నేరుగా గవర్నర్‌కే ఫిర్యాదు చేసిన పరిస్థితులు ఉన్నాయి. గవర్నర్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును ఈ విషయమై ఆరా తీసినట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో తీవ్రంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు జిల్లా ఎస్పీలను, ఐదుగురు కలెక్టర్లను బదిలీ చేయాలని ఇంటిలిజెన్స్ నివేదిక ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందింది. అయినా, వారిని బదిలీ చేయలేకపోయారు. చంద్రబాబు కూడా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు సంబంధించిన నివేదికలను తెప్పించుకున్నారు. వీరందరినీ ముఖ్యమంత్రి చంద్రబాబు విడతల వారీగా పిలిపించి, నివేదిక సారాంశాన్ని వారి ముందుంచుతున్నారు.దీంతో ఐఎఎస్, ఐపిఎస్‌లు మానసికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ప్రతి ఐపిఎస్ అధికారితో చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ నిర్వహించడాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలే తప్పుపడుతున్నారు. మంగళవారం కూడా 12 మంది ఐపిఎస్ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఇలా చాలాసార్లు ఇంటర్వ్యూలు నిర్వహించారు. బదిలీ ఉత్తర్వులు వెలువడకపోవడం వలన ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల్లో తీవ్ర వత్తిడి పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఐఎఎస్ అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని ప్రభుత్వంలోని ఒక కీలక వ్యక్తి తెలియచేశారు. తమకు ఎలాగూ బదిలీ అయిపోతుందన్న ఉద్దేశంతో వారు విధులు నిర్వర్తించలేకపోతున్నారని అన్నారు. అలాగే కొంతమంది ఐపిఎస్ అధికారులపై ఫిర్యాదులు వచ్చినప్పుడు మంత్రులే వారికి అండగా నిలబడ్డం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
నేడు ఉత్తర్వులు?
ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడతాయని తెలుస్తోంది. అలాగే 15 మంది ఐఎఎస్ అధికారులను కూడా బదిలీ చేస్తారని తెలిసింది. మరికొంతమంది ఐఎఎస్, ఐపిఎస్‌లను జూన్ రెండో వారంలో బదిలీ చేస్తారని తెలుస్తోంది.