తెలంగాణ

ప్రతిపక్షాలన్నీ ఏకమైనా.. మా విజయాన్ని ఆపలేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైనా పాలేరు ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ విజయాన్ని ఆపడం ఎవరితరం కాదని పాలేరు ఎన్నికల ఇంచార్జి, మంత్రి కె తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కొనసాగుతున్న విజయపరంపర పాలేరులో కూడా పునరావృతం అవుతుందని ఆయన అన్నారు.
ఖమ్మంలో ఈ నెల 27న జరుగునున్న పార్టీ ప్లీనరీకి గ్రేటర్ హైదరాబాద్ పార్టీని సన్నద్ధం చేయడానికి తెలంగాణ భవన్‌లో ఆదివారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం దేశంలోనే కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. ఆదే స్ఫూర్తిని ప్రతీ ఎన్నికల్లోనూ పార్టీ కనబరస్తుందన్నారు. ఈ క్రమంలో ఖమ్మంలో తొలిసారి నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఈ నెల 27 ఖమ్మంలో జరిగే ప్లీనరీలో రెండు సెషన్స్ ఉంటాయని, ఉదయం 4 వేల మందితో ప్రతినిధులతో సమావేశం జరుగుతుందన్నారు. దీనికి మాత్రం ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. సాయంత్రం ఖమ్మంలో బహిరంగ సభ ఉంటుందని, దీనికి అందరూ ఆహ్వనితులేనన్నారు. ప్లీనరీ ప్రతినిధుల సభలో దాదాపు 15 తీర్మానాలు ఉంటాయని, రాజకీయ తీర్మానాలు, కరువు, అభివృద్ధ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలతో పాటు రాజకీయ తీర్మానాలు ఉంటాయన్నారు. ప్రతినిధుల సభకు ఆహ్వానించిన వారు ప్లీనరీకి ముందు రోజు సాయంత్రమే ఖమ్మం చేరుకోవాల్సి ఉంటుందని కెటిఆర్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగిన విజయం మాత్రం టిఆర్‌ఎస్‌దేనన్నారు. ఇతర పార్టీలు పోటీ చేయడం వృదా ప్రయాస తప్ప వారు సాధించేది ఏమి లేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి ప్రజలు అవసరమైనప్పుడుల్లా పార్టీకి అండగా నిలుస్తున్నారన్నారు. ఈ సమావేశంలో నగర మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన
సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కెటిఆర్