తెలంగాణ

టిఆర్‌ఎస్‌లోకి పువ్వాడ అజయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 24: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖమ్మం శాసనసభ్యుడు పువ్వా డ అజయ్‌కుమార్ అధికార టిఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఆయన విలేఖరులతో మా ట్లాడుతూ రెండేళ్ళపాటు ఖమ్మం జిల్లా లో కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేందుకు ఒంటరిగా ప్రయత్నించానన్నారు. కాంగ్రెస్ నాయకత్వం మాత్రం గుడ్డిగా ప్రభుత్వ పథకాలను వ్యతిరేకించాలని చెప్తున్నదని, ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామప్రాజెక్టును వ్యతిరేకించాలని చెప్పడం బాధ కలిగించిందన్నారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా ఎదురీది పది స్థానాల్లో గెలిపించుకోగలిగానని, కనీస సహకారం కూడా పై స్థాయి నుంచి లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసేవారికి కాకుండా కేవలం కార్యాలయాల్లో ఉండేవారికే కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇచ్చారని, తనలాంటి వారిని కేవలం సభ్యులుగా మాత్రమే నియమించారని ఆరోపించారు. రాష్టమ్రంతా ముఖ్యమంత్రిని అభినందిస్తుంటే తాము వ్యతిరేకించడం వల్ల ప్రజల్లో చులకన అవుతున్నామన్నారు. అభివృద్ధిని చూసి తాను అధికార పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. తనతో పాటు ఎవరిని రమ్మని ఒత్తిడి చేయనని, తనపై కూడా ఎవరి ఒత్తిడి పనిచేయదని స్పష్టం చేశారు.
అదే బాటలో ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్..
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఫారుఖ్ హు స్సేన్ సోమవారం టిఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. మెదక్ జిల్లాకు చెందిన ఫారుఖ్ హుస్సేన్ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సన్నిహితుడు అయినప్పటికీ, ఇంతకాలంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరసబట్టి టిఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో తాను కూడా టిఆర్‌ఎస్‌లో చేరడానికి సుముఖంగా ఉన్నట్టు ఫారుఖ్ హుస్సెన్ నుంచి సంకేతాలు రావడంతో ఆదివారం ఆయనతో మంత్రి హరీశ్‌రావు చర్చలు జరిపినట్టు తెలిసింది. ఈ భేటీ అనంతరం ఫారుఖ్ హుస్సెన్ చేరికకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది.
హైదరాబాద్‌లో అక్రమంగా వలసలు?
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 24: నగరంలో అక్రమంగా వలస వచ్చిన విదేశీయులను గుర్తించేందుకు సైబరాబాద్ పోలీసులు ఇటీవల నగరాన్ని జల్లెడ పట్టారు. ఎన్జీవోల సహకారంతో 1761 మందిని గుర్తించారు. వీరిలో మయన్మార్‌కు చెందిన రోహింగ్యా ముస్లింలే అధికంగా ఉన్నారు. యునైటెడ్‌నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజిస్ డేటా ప్రకారం..నగరానికి అక్రమంగా వలస వచ్చి నివాసమేర్పరచుకున్న 1761 మందిలో 1518 మంది మయన్మార్‌కు చెందిన రోహింగ్యా ముస్లింలు కాగా ఐదుగురు నాన్ రోహింగ్యా ముస్లింలు, అఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఒకరు, గ్రీస్ దేశానికి చెందిన 9మంది, ఇరాన్‌కు చెందిన ఇద్దరు, పాలస్తీనాకు చెందిన 31 మంది, సొమాలియాకు చెందిన 168 మంది, సూడాన్‌కు చెందిన 28 మంది, సిరియాకు చెందిన ఇద్దరు ఉన్నారు. యుఎన్‌హెచ్‌సిఆర్‌లో ఎలాంటి నమోదు చేసుకోకుండా వీరు ఇక్కడ నివాసమేర్పాటు చేసుకున్నారని సైబరాబాద్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
అయితే వీరికి యుఎన్‌హెచ్‌సిఆర్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా వివరాలను సేకరించారు. వీరికి గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు కూడా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు. నగరంలోని బాలాపూర్, బాబానగర్, బార్కస్, రాయల్‌కాలనీ, షాహీన్ నగర్, జూలపల్లి, కిషన్‌బాగ్‌లలో నివాసముంటూ దినసరి కార్మికులుగా పనిచేస్తున్న 300 మంది యుఎన్‌హెచ్‌సిఆర్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలిసింది. కాగా రోహింగ్యా ముస్లింలకు కొంత మందికి మాత్రమే గుర్తింపు కార్డులు వచ్చాయని మరో ఐదువందల కుటుంబాలకు గుర్తింపు కార్డులు రావాల్సి ఉందని వారు తెలిపారు. అదేవిధంగా ఆఫ్రికాకు చెందిన కొంత మంది స్టూడెంట్ వీసాపై వచ్చి, వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నట్టు తెలుస్తోంది. 318 మంది పాకిస్తానీయులు, 18 మంది బంగ్లాదేశీయులు స్టూడెంట్ వీసాలపై వచ్చి నగరంలో ఉంటున్నట్టు సమాచారం.