రాష్ట్రీయం

మే 13 నుండి పీఈసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: రాష్ట్రంలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు బీపీఈడీ, డీపీఈడీల్లో ప్రవేశానికి మే 13వ తేదీ నుండి పీఈసెట్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 21న విడుదల చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులను అదే రోజు నుండి స్వీకరిస్తారు. ఏప్రిల్ 13 వరకూ ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తులను స్వీకరిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి , కన్వీనర్ ప్రొఫెసర్ వీ సత్యనారాయణ తెలిపారు. 500 రూపాయిల జరిమానాతో ఏప్రిల్ 22 వరకూ, 2వేల రూపాయిల జరిమానాతో 29వ తేదీ వరకూ, 5వేల రూపాయిల జరిమానాతో మే 6 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ 20 నుండి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వారందరికీ మే 13 నుండి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు.
ప్రిన్సిపాల్ పోస్టులకు నోటిఫికేషన్
తెలంగాణ మహిళల డిగ్రీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్‌లో మొత్తం 34 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. సోషల్ వెల్ఫేర్‌లో 19 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్‌లో 15 పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. మార్చి 10లోగా దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు తమ బయోడాటాను అప్‌డేట్ చేసుకోవాలని చెప్పారు.
ఇతర అనుమానాలను 040-23317140 నెంబర్‌కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని వారు సూచించారు.