రాష్ట్రీయం

ఒంటరిగా వదిలేశారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 16:కోవిడ్-19 వైరస్ బారిన పడిన చైనాలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో అక్కడ చిక్కుకుపోయిన కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణానికి చెందిన యువతి అనె్నం జ్యోతి పచ్చడి మెతుకులే పరమాన్నంగా తింటూ కాలం వెళ్లదీస్తోంది. గత 15 రోజులకు పైగా సరైన ఆహారం లేదంటూ తన తల్లి ప్రమీళమ్మకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. చైనాలోని వుహాన్ నగరానికి శిక్షణ కోసం వెళ్లిన జ్యోతి తిరిగి భారత్ వచ్చే క్షణాన అధిక శరీర ఉష్ణోగ్రత కారణంగా ఆమెను విమానంలోకి అనుమతించకపోవడంతో అక్కడే నిలిచిపోవాల్సిన విష యం తెలిసిందే. గత 15 రోజులుగా ఆమె తిరిగి స్వదేశానికి రావాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో అక్కడే ఉండిపోయింది. గదిలో ఒంటరిగా వదిలేశారని ఏమీ దిక్కు తెలియడం
లేదని జ్యోతి తన తల్లితో చెప్పి రోదిస్తోంది. పగలు కాస్త ధైర్యంగా ఉన్నా రాత్రివేళ మాత్రం భయం అవుతోందని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రతి రోజూ చైనా అధికారులు తమ అపార్ట్‌మెంట్‌కు ఆహారం పంపిస్తున్నారని, అయితే అందులో ఎక్కువగా మాంసాహారమే ఉంటుందని జ్యోతి వెల్లడిస్తోంది. అసలే వైరస్‌తో దేశం అతలాకుతలం అవుతున్నా వారు మాంసాహారానికే ప్రాధాన్యత ఇవ్వడం ఏమీ అర్థం కావడం లేదని స్పష్టం చేసింది. అయితే తాను మాత్రం మాంసాహారానికి దూరంగా ఉన్నానని బ్రెడ్, నూడుల్స్, అన్నం తీసుకుంటున్నట్లు తెలిపింది. భారతదేశంలో మాదిరి అక్కడి బియ్యం రుచించకపోయినా తప్పని పరిస్థితుల్లో దానినే తీసుకోవాల్సి వస్తుందని జ్యోతి వెల్లడించింది. అన్నంలోకి ఇంటి నుంచి తీసుకెళ్లిన పచ్చడి వేసుకుని తింటూ కాలం వెళ్లదీస్తున్నానని తెలిపింది. నూడుల్స్, బ్రెడ్, బిస్కెట్లు వీటితోనే కాలం గడుపుతున్నానని తన తల్లికి తెలిపింది. ప్రస్తుతం ఎలాంటి జ్వరం గాని, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఏమీ లేవని పేర్కొన్న జ్యోతి తనకు ఎవరూ వైద్య పరీక్షలు చేసేందుకు రాలేదని వెల్లడించినట్లు తెలిసింది. కాగా ఆమెను భారత్ తీసుకు రావడానికి పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై వత్తిడి తీసుకొస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం జ్యోతినే కాకుండా చైనాలో చిక్కుకుపోయిన భారతీయులను అందరినీ తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నా అక్కడి పరిస్థితులు అనుకూలించకపోవడం, చైనా అధికారులు అనుమతులు ఇవ్వకపోవడం వంటి సమస్యల కారణంగా తీసుకు రాలేకపోతున్నట్లు కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపిన విషయం విదితమే. కరోనా వైరస్ బారిన పడి చైనా నుంచి ఎప్పుడు బయటకు వస్తామో తెలియని పరిస్థితుల్లో జ్యోతి తీవ్ర ఆందోళన చెందుతుందని ఆమె తల్లి ప్రమీళమ్మ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చైనా ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి తమ కూతురిని భారతదేశానికి తీసుకుని రావాలని ఆమె వేడుకుంటున్నారు.

*చిత్రం... అనె్నం జ్యోతి