రాష్ట్రీయం

ప్లాట్‌ఫారం టిక్కెట్ ధర రూ. 20కు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 11: సంక్రాంతి పండగ రద్దీ అంటూ రైల్వే శాఖ ఉన్నఫళంగా ప్లాట్‌ఫారం టిక్కెట్ ధరను ఒక్కసారి రూ. 10 నుంచి రూ. 20కి పెంచేసింది. ఈ పెంపు శనివారం నుంచి అమల్లోకి రాగా ఈ నెల 19వ తేదీ వరకు అమల్లో ఉండనుంది. రాష్ట్రంలో విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు రైల్వేస్టేషన్‌లలో ఈ పెంపు అమల్లోకి వచ్చింది. ప్లాట్‌ఫారాలపై రద్దీ నివారణ కోసమే రేటు పెంచాల్సి వచ్చిందని రైల్వే అధికారులు అంటున్నారు. ఇక ప్యాసింజర్ రైళ్లలో సమీప రైల్వేస్టేషన్‌లకు కనీస చార్జీ కేవలం రూ. 10 మాత్రమే. ఈ రూ. 10 టిక్కెట్‌తో 24 గంటలపాటు రైల్వే స్టేషన్ మొత్తం తిరగవచ్చు. అయితే రూ. 20 ప్లాట్‌ఫారం టిక్కెట్ కేవలం మూడు గటలకే పరిమితం కావటం గమనార్హం.