రాష్ట్రీయం

రాష్ట్రపతి రాకకు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాక సందర్భంగా ఏర్పాట్లపై సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈనెల 20న రాష్ట్రపతి హైదరాబాద్ వస్తారు. ఎనిమిది రోజులపాటు ఉంటారు. రాష్టప్రతి రాక సందర్భంగా పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ వ్యవహాలు, రోడ్లుభవనాలు, ఉద్యాన, వైద్య ఆరోగ్యం తదితర శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షిస్తారు. రాష్టప్రతి కార్యక్రమాలను రాష్ట్రపతి నిలయం అధికారులే పర్యవేక్షిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎస్ సమీక్షిస్తున్నారు. బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో రామ్‌నాథ కోవింద్ విడిదికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. రాష్టప్రతి నిలయాన్ని శుభ్రం చేయడం, పార్కులను శుభ్రం చేయడం, రాష్ట్రపతి కోసం వచ్చే వారు వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేయడం పూర్తయ్యాయి. రాష్ట్రపతి పర్యటన, షెడ్యూల్ ఒకటి రెండు రోజుల్లో వెలువడుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.