ఆంధ్రప్రదేశ్‌

రూ.9,600 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 15: అమరావతిని అనుసంధానం చేస్తూ ఇప్పటికే ఉన్న 216 ఏ, 16వ నెంబర్ జాతీయ రహదారులను రూ.9,600 కోట్లతో విస్తరిస్తున్నారు. గుండుగొలను నుంచి దివాన్‌చెరువు వరకు 216 ఏ జాతీయ రహదారిని, దివాన్‌చెరువు నుంచి ఇచ్చాపురం వరకు 16వ నెంబర్ జాతీయ రహదారిని 280 కిలోమీటర్ల మేర అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఆస్ట్రేలియాకు చెందిన సేఫ్ వే కనిషేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ రూ.9600 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టింది. టోల్ ఆపరేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్ (టీవోటీ) విధానంలో ఈ రోడ్ల అభివృద్ధి చేపట్టారు. ఇందులో భాగంలో ఈ రెండు ఎన్‌హెచ్‌లను విస్తరించడం, సెంట్రల్ లైటింగ్, సర్వీసు రోడ్లు, 12 బ్రిడ్జిలను ఆధునికీకరించడం చేస్తారు. ఈ రెండు జాతీయ రహదారుల్లో సీసీ కెమెరాలు, ఏటీఎం కెమెరాలు, వీఐడీ కెమెరాలు, పీటీజడ్ కెమెరాలు, రెండు వైపులా రోడ్లకు రెయిలింగ్‌లు, వెహికల్ యాక్టివేటెడ్ స్పీడ్ డిస్‌ప్లేస్, కంట్రోల్ రూమ్‌లు నిర్మిస్తారు. అన్నవరం, కత్తిపూడి, దివాన్‌చెరువు తదితర చోట్ల వేగ నియంత్రణ పరిశీలన కేంద్రాలను నిర్మిస్తారు. ప్రతీ రెండు కిలోమీటర్లకు ఒకచోట ఎమర్జన్సీ కాల్ సెంటర్లను నిర్మిస్తారు. 2020 నుంచి 30 సంవత్సరాల
పాటు టోల్ టాక్సు వసూలుచేస్తారు. గుండుగొలను నుంచి ఇచ్చాపురం వరకు ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఉంగుటూరు, ఈతకోత, కృష్ణవరం, వేంపాడు వద్ద ఎన్‌హెచ్‌ఏఐ నిర్వహణలో టోల్ ప్లాజాలు నిర్వహిస్తారు. జాతీయ రోడ్లు పరిశోధనా సంస్థ రావులపాలెం గౌతమీ పాత బ్రిడ్జి, సిద్ధాంతం బ్రిడ్జిలను పరిశీలిస్తోంది. జాతీయ రోడ్ల పరిశోధనా సంస్థ అధ్యయనం మేరకు ఈ రెండు బ్రిడ్జిలను కూడా అభివృద్ధి చేయనున్నారు. ఈ రెండు జాతీయ రహదారుల విస్తరణవల్ల ఈ ప్రాంతం భౌగోళికంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం వుంది. ప్రస్తుతం శరవేగంగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇదిలావుండగా జాతీయ రహదారిపై వాహనాలకు కొత్తగా ఫాస్ట్‌టాగ్ విధానం ఆదివారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. దీనివల్ల టోల్‌ఫ్లాజాల వద్ద ఎటువంటి ఆలస్యం లేకుండా సత్వరం ముందుకెళ్లే అవకాశం కలుగుతుంది. ఈ విధానం వల్ల సమయంతోపాటు పెట్రోలు, డీజిల్ ఆదా కూడా అవుతుంది.