రాష్ట్రీయం

ట్రైనీ ఐపీఎస్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్‌రెడ్డిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ప్రేమ పెళ్లి చేసుకుని వేధించారని మహేశ్వర్‌రెడ్డిపై ఆయ న భార్య భావన హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ పోలీస్టేషన్‌లో గతంలో ఫిర్యాదు చేసిం ది. ఈ మేరకు జవహర్‌నగర్ పోలీసులు గృహహింస, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమో దు చేశారు. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున తాత్కాలికంగా మహేశ్వర్‌రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులో పేర్కొంది. కేసు నుంచి విముక్తి పొందిన తర్వా త తిరిగి అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన మహేశ్వర్‌రెడ్డి సివిల్స్‌లో 126వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ముస్సోరిలో ఆయన ప్రాథమిక శిక్షణ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భా య్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో మిగతా శిక్షణ పూర్తి చేసుకోవాల్సి ఉంది. మహేశ్వర్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నపుడు కీసరకు చెందిన భావనతో పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారి గత ఎనిమిదేళ్ల అనంత రం ఇద్దరూ అక్కడి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2018 ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. మహేశ్వర్‌రెడ్డి ఐపీఎస్‌గా ఎంపికైన తర్వాత తనకు విడాకులిచ్చి కట్నం కోసం మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడని భావన జవహర్‌నగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అసలు విషయాన్ని రాబట్టారు. దీంతో క్రమశిక్షణలో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్‌రెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
*చిత్రం... బాధితురాలు బయటపెట్టిన పెళ్లినాటి ఫొటో