రాష్ట్రీయం

నేటి నుంచి సిరిసిల్లలో 39వ వేదాంత విజ్ఞాన మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 12 నుండి అయిదు రోజుల పాటు 39వ వేదాంత విజ్ఞాన మహాసభలు ఘనంగా నిర్వహించనున్నారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ మహాసభలకు విస్తృత, భారీ ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం ఆహ్వాన కమిటీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ కార్యక్రమంలో ప్రతి రోజు 70 మంది పీఠాధిపతులు, 30 మంది మాతాజీలు పాల్గొని ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రవచనాలు ఇవ్వనున్నారు. సిరిసిల్ల శివనగర్ శ్రీరాజ రాజేశ్వర స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఈ వేదాంత విజ్ఞాన మహాసభలు నిర్వహిస్తున్నారు. మహాసభల్లో 147వ పంచాహ్నిక శ్రీవిష్ణు సహస్రనామ అఖండ పారాయణములు నిర్వహిస్తుండగా, ఆరు రోజుల పాటు స్వాములు, పీఠాధిపతులు ప్రవచనాలు ఇవ్వనున్నారు. అలాగే ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అయిదు రోజుల పాటు 10 సదస్సులు నిర్వహిస్తుండగా గురువారం డిసెంబర్ 12న ప్రారంభ రోజు నిత్య శ్రీశుద్ధానందగిరి స్వామి అధ్యక్షతన ప్రథమ సదస్సుకు విశిష్ట అతిధిగా శ్రీత్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి శ్రీవిష్ణు సహస్రనామస్తోత్రం-సాధన పంచకమ్‌పై ప్రవచనాలు నిర్వహిస్తారు. ఇదే రోజు మధ్యాహ్నం శ్రీత్రిదండి అష్టాక్షరీ సంత్కుమార్ రామానుజ జీయర్ స్వామి ద్వితీయ సదస్సులో ప్రవచనాలు చేస్తారు. డిసెంబర్ 13న ఉదయం తృతీయ సదస్సులో శ్రీపరిపూర్ణానందగిరి స్వామి, ఇదే రోజు సాయంత్రం చతుర్థ సదస్సులో శ్రీస్వరూపానంద స్వామి అధ్యక్షతన విశిష్ట అతిథి శ్రీపరిపూర్ణానంద సరస్వతీ స్వామి ప్రవచనలు చేస్తారు. 14న ఉదయం పంచమ సదస్సులో శ్రీవాసుదేవానందగిరి స్వామి, ఇదే రోజు సాయంత్రం షష్టమ సదస్సులో శ్రీశంకరానందగిరి స్వామి ప్రవచనాలు ఇస్తారు. 15న ఉదయం సప్తమ సదస్సులో శ్రీజ్యోతిర్మయానంద భారతీ మాతాజీ, ఇదే రోజు సాయంత్రం అష్టమ సదస్సులో శ్రీయోగిని శ్రీచంద్రకాళీ ప్రసాద మాతాజీ ప్రవచనాలు వినిపిస్తారు.
16న ఉదయం నవమి సదస్సుకు శ్రీపరమాత్మానందగిరి స్వామి అధ్యక్షతన విశిష్ట అతిథి శ్రీవిద్యా శంకరభారతి స్వామి ప్రవచనాలు వినిపిస్తారని వెల్లడించారు.