రాష్ట్రీయం

ఆశ్రయ ఆకృతి సంస్థకు ఎస్‌బీఐ ప్రగతి లేడీస్ క్లబ్ విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆశ్రయ ఆకృతి స్వచ్ఛంద సంస్థకు అమరావతి సర్కిల్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రగతి లేడీస్ క్లబ్ కమర్షియల్ మిక్సీని, గ్యాస్ స్టౌవ్‌ను, ఏకకాలంలో 10 దోశలను చేసే గ్యాస్ తవ్వ, ఫిల్టర్ నీళ్ల డిస్పెన్సర్‌ను వితరణగా అందజేసింది. వీటన్నింటినీ ఎస్‌బీఐ ప్రగతి లేడీస్ క్లబ్ అధ్యక్షులు హన్న రాచెల్ మణి ఆశ్రయ ఆకృతి సంస్థ డైరెక్టర్ డీపీకే బాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో లేడీస్ క్లబ్ సభ్యులు అంతా పాల్గొన్నారు. ఆశ్రయ ఆకృతి సంస్థ 1996లో ఏర్పాటైందని, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు పాఠశాలలు, బదిరులకు రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్వహిస్తోందని బాబు చెప్పారు. నవజాత శిశువులకు చెవి పరీక్షలు నిర్వహించి అవసరమైన ఉపకరణాలను కూడా సంస్థ అందజేస్తోందని ఆయన చెప్పారు.

*చిత్రం...ఆశ్రయ ఆకృతి స్వచ్ఛంద సంస్థకు పలు వస్తువులను అందజేస్తున్న అమరావతి సర్కిల్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రగతి లేడీస్ క్లబ్ కమర్షియల్