రాష్ట్రీయం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 10: నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుండి బుధవారం మధ్యాహ్నం పీఎస్‌ఎల్‌వీ సీ48 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న నేపథ్యంలో మంగళవారం ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉపగ్రహ నమూనాను స్వామి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న ఆయనకు రంగనాయక మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా, టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపల శివన్ విలేఖరులతో మాట్లాడుతూ పీఎస్‌ఎల్‌వీ సీ48 ఉపగ్రహ ప్రయోగానికి మంగళవారం మధ్యాహ్నం 4.25గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారన్నారు. ఇది నిరంతరంగా 23గంటల వరకు కొనసాగుతుందన్నారు. బుధవారం మధ్యాహ్నం 3.25 గంటలకు నింగిలోనికి ప్రయోగించనున్నామన్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని దేవుడ్ని ప్రార్థించానన్నారు. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 50వ ఉపగ్రహం కావడంతో ఇదో చారిత్రాత్మకమైన ప్రయోగమని, రీశాట్2బి ఆర్1 అనే స్వదేశీ ఉపగ్రహంతో పాటు 9 విదేశీ కమర్షియల్ ఉపగ్రహాలను ఈ ప్రయోగం ద్వారా కక్ష్య లోనికి పంపనున్నామని ఆయన వివరించారు. నానా ఉపగ్రహాల్లో ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్‌కు సంబంధించి ఒక్కటి చొప్పున, ఏఎస్‌ఏకు చెందిన ఆరు ఉపగ్రహాలు ఉన్నాయన్నారు. ఈ ఏడాది షార్ నుండి ఆరవ ప్రయోగం కాగా, శ్రీహరి కోట నుండి 75వ ప్రయోగం అని శాస్తవ్రేత్తలు తెలిపారు.
వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల
తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం ఎక్కువ మంది వయోవృద్ధులు, దివ్యాంగులకు, ఐదు సంవత్సరాల లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు కల్పించాలన్న ఉన్నతాశయంతో టీటీడీ ప్రతి నెలారెండు సామాన్య రోజుల్లో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది. ఇందులోభాగంగా ఐదు సంవత్సరాల లోపు చంటిపిల్లలు, వారి తల్లిదండ్రులను డిసెంబర్ 11, 18 తేదీల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండురోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. అదే విధంగా, డిసెంబర్ 17వ తేదీన వయోవృద్ధులు (65సంవత్సరాలు పైబడిన వారు), దివ్యాంగులకు 4వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2గంటలకు 2వేల టోకెన్లు, 3గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లను జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజు ఉదయం 10గంటలకు, మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. భక్తుల కోరిక మేరకు మరింత మందికి స్వామివారి దర్శనం కల్పించేందుకు నెలలో రెండురోజుల పాటు టీటీడీ అదనంగా దర్శన టోకెన్లను జారీ చేస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.