రాష్ట్రీయం

ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆత్మహత్య చేసుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: దుర్గాప్రసాద్ కథానాయకుడిగా నటించిన ‘నానిగాడు’ సినిమా యూట్యూబ్‌లో లీక్ అవడంతో చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సనిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సన్నాహాలు చేస్తుండగా మరోపక్క పూర్తి చిత్రం యూట్యూబ్‌లో ప్రత్యక్షం కావడంతో చిత్ర బృందం ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వద్ద దుర్గాప్రసాద్‌తో పాటు చిత్ర బృందం ఆందోళన చేపట్టింది. రూ.40 లక్షలు ఖర్చుపెట్టి సినిమా తీశామని, సెన్సార్ బోర్డ్ యు సర్ట్ఫికెట్ ఇచ్చిందని, ఎంతో కష్టపడి తీసిన చిత్రాన్ని విడుదల కాకముందే యూట్యూబ్‌లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. యూట్యూబ్ లీగ్‌ను వెంటనే తొలగించి తగిన న్యాయం చేయాలని చిత్ర యూనిట్ విజ్ఞిప్తి చేసింది.