రాష్ట్రీయం

‘దిశ’ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌కు చెందిన వెటర్నరీ వైద్యురాలు దిశపై కొందరు మృగాళ్లు హత్యాచారానికి పాల్పడిన ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘానికి హైదరాబాద్ పోలీసులు నివేదికను అందించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ అపహరణ, అత్యాచారం, మృతదేహం కాల్చివేత వివరాలను ఆ నివేదికలో పేర్కొన్నారు. నిందితులు దిశపై అత్యాచారం చేసి హత్య చేశారని పేర్కొంటూ ఫోరెన్సిక్ ఆధారాలతో కూడిన నివేదికను సైబరాబాద్ పోలీసులు ఎన్‌హెచ్‌ఆర్సీకి అందజేశారు. అన్ని శాస్ర్తియ ఆధారాలతో పాటు రక్తపు మరకల డీఎన్‌ఏ రిపోర్టు, ఘటనాస్థలిలో లారీ తిరిగిన సీసీ పుటేజీ, నిందితులు కొత్తూరులో పెట్రోల్ కొనుగోలు చేసిన పుటేజీని ఎన్‌హెచ్‌ఆర్సీ దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు. ఈ కేసులో కీలకమైన ఆధారాలను ఎన్‌హెచ్‌ఆర్సీకి అందజేసిన నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించడంతోనే తాము కాల్పులు జరిపామని పోలీసులు పేర్కొంటున్నారు. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌కౌంటర్‌పై సిట్ బృందం విచారణ జరుపుతోంది. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో సిట్ సభ్యుల బృందం దర్యాప్తు చేపట్టింది. చటాన్‌పల్లి వద్ద ఈనెల 6న జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో నిందితులు నలుగురు మృతి చెందారు. ఎన్‌కౌంటర్‌పై పలు మహిళా హక్కుల సంఘాల ప్రతినిధులు రాసిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది.