రాష్ట్రీయం

ఆ లాఠీ ఎలా వచ్చిందో డీజీపీ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వైసీపీకి చెందిన రౌడీలే ప్రతిపక్ష నేత బస్సుపైకి రాళ్లు, చెప్పులు ఆఖరికి పోలీసుల లాఠీ విసిరి దాడికి పాల్పడ్డారని, జరిగిన సంఘటనకు డీజీపీ, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యత వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య అన్నారు. వారి నేతృత్వంలోని టీడీపీ నేతల బృందం మంగళవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఇటీవల రాజధాని అమరావతి పర్యటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న బస్సుపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ని కలిసిన అనంతరం అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య విలేఖర్లతో మాట్లాడుతూ గత నెల 28వ తేదీన అమరావతి ప్రాంతంలో చంద్రబాబు బస్సులో వెళుతున్న మార్గంలో 30 మంది ఆందోళనకారులు ఒక చోట చేరి రాళ్లు, చెప్పులు విసురుతుంటే అక్కడున్న 2వేల మంది పోలీసులు వారిని అదుపు చేయకుండా చోద్యం చూశారని మండిపడ్డారు. జరిగిన ఘటనపై డీజీపీ బాధ్యతారహితంగా మాట్లాడారని, సభ్య సమాజం సిగ్గుపడేలా ఆయన వ్యాఖ్యలున్నాయన్నారు. నవంబర్ 28 ఉదయం 10 గంటల నుండి రాత్రి 6 గంటల వరకు టీడీపీ అధినేతతో సహా ఇతర నేతలందరం అమరావతిలో పర్యటించామని, ఎక్కడా కూడా ఆ ప్రాంతవాసుల నుంచి ఏ విధమైన నిరసన వ్యక్తం కాలేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సిట్ పురోగతి సాధించినట్లు ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలు తమ దృష్టికి వచ్చాయని వర్ల రామయ్య తెలిపారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి వీలైనంత త్వరగా ఈ కేసుకి ముగింపు ఇవ్వాలన్నారు. గవర్నర్‌ని కలిసిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, మద్దాలి గిరిధర్, నిమ్మల రామానాయడు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, తెనాలి శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా కార్యకర్త అరెస్ట్ అమానుషం
గుంటూరు: రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలుగుదేశం కార్యకర్తలే లక్ష్యంగా కక్షసాధింపు చర్యలకు దిగుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు మండిపడ్డారు. ఈ కోవలోనే గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో టీడీపీ మహిళా కార్యకర్త పద్మజను అరెస్ట్ చేయడం అమానుషమన్నారు. బస్సుపై దాడిచేసిన వారిని వదిలిపెట్టి తెలుగుదేశం శ్రేణులను వేధించడం దేనికి సంకేతమని నిలదీశారు. మంగళవారం ఈ మేరకు గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళ అని కూడా చూడకుండా వైసీపీ నేతలు అక్రమ కేసులతో వేధించడం సిగ్గుచేటన్నారు. మహిళలపై జగన్‌కు ఉన్న గౌరవం ఏ పాటితో తాజా ఘటనలు చూస్తే అర్ధమవుతుందన్నారు.
మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోండి
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)పై మంగళవారం పోలీసులకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై మంత్రి కొడాలి నాని పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, తక్షణం మంత్రిపై చర్యలు తీసుకోవాలని మంగళగిరి పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రస్తావిస్తూ కొద్ది రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ‘నీ అమ్మ మొగుడు కట్టించాడా’, డిక్లరేషన్ ఎందుకివ్వాలి అంటూ టీటీడీ ప్రతిష్టను కించపరిచేలా, మసకబార్చేలా మాట్లాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 22వ తేదీన విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడిని కించపర్చడంతో పాటు ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారని, తక్షణం మంత్రిని అరెస్ట్ చేయాలని కోరారు.
కంకిపాడులోనూ..
ఇలాఉంటే కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసు స్టేషన్‌లో కూడా మంత్రి కొడాలి నానిపై స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. కొడాలి నానిపై చట్టరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఒక్క ఆరోపణైనా నిరూపించగలిగారా?
విజయవాడ(సిటీ): తెదేపా ప్రభుత్వం, చంద్రబాబుపై అవినీతి బురద జల్లబోయి చేతులు కాల్చుకున్నా ఇంకా వైసీపీ ప్రభుత్వానికి, నాయకులకు బుద్ధి రావడం లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శినారా లోకేష్ విమర్శించారు. పీపీఏల దగ్గర నుండి ప్రతీ అంశం పైనా జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి జగన్‌కు షాక్ కొట్టిందని మంగళవారం ట్విట్టర్‌లో లోకేష్ తెలిపారు. అయినా ఆరోపణలు చేస్తున్న వారు మరోసారి పార్లమెంట్ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారన్నారు. పోలవరం అంశంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలకు కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా చెప్పిన సమాధానం చెంపపెట్టు కాదా అని ప్రశ్నించారు. ఆరు నెలల్లో చేసిన ఒక్క ఆరోపణైనా నిరూపించగలిగారా అని లోకేష్ ప్రశ్నించారు.
చంద్రబాబుపై చెప్పులతో, రాళ్ళతో దాడి చేస్తూ భావ ప్రకటన సేఛ్ఛ అంటున్న వైసీపీ నేతలపై లోకేష్ మండిపడ్డారు. ఆ స్వేఛ్ఛ మీకు ఒక్కరికేనా ప్రజలకు లేదా అని ప్రశ్నించారు.

*చిత్రం...గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నేతలు