రాష్ట్రీయం

మరో ప్రతిష్టాత్మక విన్యాసాలకు ఈఎన్‌సీ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 3: మూడేళ్ల కిందట ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) నిర్వహించిన తూర్పు నౌకాదళం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సిద్ధం అవుతోంది. మిలాన్ 2020 పేరిట వివిధ దేశాల నౌకాదళాలతో కలిసి సంయుక్త విన్యాసాలు నిర్వహించనున్నారు. ‘సినర్జీ ఎక్రాస్ ద సీ’ థీమ్‌తో ఈ కార్యక్రమం మార్చి 18 నుంచి 27 వరకూ జరగనుంది. దాదాపు 41 దేశాల నౌకాదళాలకు ఆహ్వానం పంపామని, వీటిలో 30 దేశాలు పాల్గొనేందుకు అంగీకారం తెలిపారని ఈఎన్‌సీ చీఫ్ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ విశాఖలో మంగళవారం తెలిపారు. మిలాన్ 2020లో మార్చి 18 నుంచి 23 వరకూ హార్బర్ ఫేజ్ విన్యాసాలు జరుగుతాయని, 24 నుంచి 26 వరకూ సీ ఫేజ్ విన్యాసాల్లో వివిధ దేశాల నౌకాదళాలు పాల్గొంటాయన్నారు. మార్చి 27 ముగింపు కార్యక్రమం జరుగుతుందన్నారు. హార్బర్ ఫేజ్ విన్యాసాల్లో భాగంగా వివిధ దేశాల నౌకాదళాల మధ్య ఇంటరాక్షన్ సెషన్స్ జరుగుతాయన్నారు. సీఫేజ్‌లో వివిధ దేశాల నౌకదాళాలతో స్నేహపూర్వక విన్యాసాలు ఉంటాయన్నిరు. మిలాన్ 2020కు వివిధ దేశాల నుంచి సుమారు 3000 మంది ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నట్టు తెలిపారు.