క్రైమ్/లీగల్

వర్మ సినిమాకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఆ చిత్రాన్ని ఈనెల 29వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించగా, ఫిల్మ్ సెన్సార్ బోర్డు చిత్రం విడుదలకు సర్ట్ఫికేట్ జారీ చేయడం లేదని రామ్‌గోపాల్ వర్మ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ, వారం రోజుల్లో చిత్రాన్ని చూసి అభ్యంతరాలను స్వీకరించి, తదనుగుణంగా సర్ట్ఫికేట్ జారీ చేయాలని ఫిల్మ్ సర్ట్ఫికేషన్ బోర్డును
ఆదేశించింది. సెన్సార్ బోర్డుకు హైకోర్టు వారం రోజులు గడువు ఇవ్వడంతో 29వ తేదీన విడుదల చేయాలనే ఆకాంక్ష నెరవేరేలా లేదని తెలుస్తోంది. సినిమా టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మరికొంత మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. టైటిల్ రెండు కులాల మధ్య చిట్ట పెట్టేలా ఉందన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. కొంత మంది వ్యక్తులను కించపరిచేలా వర్మ తన సినిమాలో పాత్రలను చూపించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే విషయమై కేఏ పాల్ సైతం కోర్టును ఆశ్రయించారు. అయితే, అవేవీ పట్టించుకోకుండా సినిమా రిలీజుకు చిత్ర బృందం ఏర్పాటు చేసుకుంది. కానీ, రిలీజుకు కొన్ని గంటల ముందు రామ్‌గోపాల్ వర్మకు హైకోర్టు షాక్ ఇచ్చింది. వివాదంపై హైకోర్టులో చర్చ సందర్భంగా సెన్సార్‌బోర్డు ఇంకా సినిమాకు సర్ట్ఫికేట్ ఇవ్వలేదని అదనపు సొలిసిటర్‌జనరల్ రాజేశ్వరరావు వివరించారు. సర్ట్ఫికేట్ రాకుండానే సినిమా రిలీజ్ అంశం ప్రసక్తే రాదని న్యాయస్థానం పేర్కొంది. అభ్యంతరాలు వ్యక్తమైన దృష్ట్యా సినిమా టైటిల్‌ను అమ్మరాజ్యంలో కడప బిడ్డలుగా మార్చామని కోర్టుకు చిత్రబృందం తెలిపింది. సినిమాకు విడుదలకు వీలుగా వీలైనంత త్వరగా సెన్సార్ సర్ట్ఫికేట్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరడంతో వారం రోజుల్లో సర్ట్ఫికేట్ జారీ చేయాలని హైకోర్టు పేర్కొంది.