రాష్ట్రీయం

రేపటి నుంచి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 20: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరగనుంది. ఈసందర్భంగా ఆలయంలో లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, మూలవరులకు అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవరులను శ్రీకృష్ణస్వామి ముఖమండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. గృహస్తులు 1,116రూపాయలు చెల్లించి టికెట్ కొనుగోలు చేసి లక్షకుంకుమార్చన సేవలో పాల్గొనవచ్చును. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, రెండు లడ్డూలు, రెండు వడలు బహుమానంగా అందజేస్తారు. ఆలయం వద్ద గల కౌంటర్‌లో కరెంట్ బుకింగ్‌లో భక్తులు ఈ టికెట్లు పొందవచ్చును. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9గంటల వరకు పుణ్యాహవచనం, రక్షా బంధనం, ఆలయ నాలుగు మాడవీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయం వద్ద గల శుక్రవారపు తోటలో ఈశాన్య దిశలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ తరువాత పాలికల్లో మట్టిని, నవధాన్యాలను ఉంచి పసుపునీళ్లు చల్లి బీజావహనం చేస్తారు. అనంతరం నివేదన, బలిహరణ, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద గోష్టి నిర్వహిస్తారు. అంకురార్పణ ఘట్టానికి వైఖానసం, పాంచరాత్ర ఆగమాల్లో విశేష ప్రాధాన్యం ఉందని, ఇవి భగవంతునికి రెండుకళ్లు వంటివని టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారులు శ్రీమత్ తిరుమల కాండూరు శ్రీనివాసాచార్యులు తెలిపారు. వైఖానసంలో మంత్రభాగాన్ని ప్రధానంగా తీసుకుని విష్ణువును అర్చిస్తారని, పాంచరాత్రంలో మంత్రం, తంత్రం, క్రియ, ముద్రలు ప్రధానంగా ఉంటాయని తెలిపారు.
లక్ష కుంకుమార్చన : శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో దాదాపు 13 సంవతసరాల క్రితం లక్ష కుంకుమార్చన సేవను ప్రవేశపెట్టారు. ఇందులో అమ్మవారి సహస్రనామాన్ని 10సార్లు 20మంది అర్చక స్వాములతో ప్రార్థన చేస్తారు. అమ్మవారు మంచి భక్తితో ఉండి పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాల్లో భక్తులందరికీ పరిపూర్ణమైన కృపాకటాక్షాలు అందించాలని కోరుతారు. భక్తులకు శక్తి, ముక్తి, భక్తి కలుగుతుందని అర్చకులు తెలిపారు.