రాష్ట్రీయం

తెలంగాణ కేసీఆర్ జాగీరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ జాగీర్ కాదని, ఆర్టీసీ సమ్మె విషయంలో అహంకార వైఖరిని ప్రదర్శించి కార్మికులకు ద్రోహం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఇక్కడ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఆర్టీసీ ఇన్‌చార్జీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ అవాస్తవాలతో హైకోర్టులో అఫిడవిట్‌ను దాఖలుచేశారన్నారు. కార్మిక సంఘాలు, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేశారని తప్పుడు అఫిడవిట్‌ను దాఖలు చేశారన్నారు. దీనిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటోగా స్వీకరించాలన్నారు. రాజకీయ పార్టీలమీద చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. సీనియర్ ఐఎఎస్ అధికారి అయి ఉండి అసత్యాలను అఫిడవిట్‌లో పేర్కొనడం భావ్యం కాదన్నారు. ఈ అధికారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయాన్ని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. ఎవరి ప్రోద్బలంతో ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారో తెలియచేయాలన్నరు. ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ఆధారాలు ఉంటే తమ పార్టీపై కేసులు పెట్టుకోవచ్చన్నారు. కార్మికుల డిమాండ్లపై చర్చలు జరపకుండా, ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఆర్టీసీ నిలబడాలని తమ పార్టీ కోరుకుంటోందన్నారు. ఆర్థికంగా బలహీనంగ ఉన్న ఏపీలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. సెప్టెంబర్ నెల వేతనాలను వెంటనే కార్మికులకు చెల్లించాలన్నారు. 19న ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సడక్ బంద్‌కు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు చెప్పరు. ఆర్టీసీపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇంత ప్రాధాన్యత ఉన్న ప్రజా సమస్యపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించకుండా దాటవేత వైఖరిని ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు. 24 మంది కార్మికులు చనిపోయినా, కేసీఆర్ వైఖరిలో ఎటువంటి మార్పులు రాలేదన్నారు. కార్మికుల ఆత్మహత్యకు ప్రతిపక్ష పార్టీలు, యూనియన్లు కారణమని నిందించి కార్మికులను అవమానపరుస్తున్నారన్నారు. కేసీఆర్ సర్కార్ అన్నిరంగాల్లో విఫలమైందని, ప్రగతిభవన్‌కు పరిమితమై పాలనను కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కార్యక్రమాలు నిలిచిపోయాయన్నారు. ప్రజల బాధలను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదన్నారు.
*చిత్రం... గాంధీ భవన్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి