రాష్ట్రీయం

ధనిక రాష్టమ్రన్నారుగా.. కేంద్రంపై నిందలెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణ ధనిక రాష్టమ్రని పదే పదే ప్రకటనలు చేసిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంపై నిందలు వేయడం ఎందుకని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకుని పరిష్కార మార్గాలు వెతకాలన్నారు. ఆర్టీసీ ఆస్తుల పంపకాలు ఇద్దరు సీఎంలు కలిసి కూర్చుని పరిష్కరించుకుంటే కేంద్రం కూడా స్వాగతిస్తుందన్నారు. ఇతర అంశాల్లో కలిసి డిన్నర్లు చేసే ఈ ఇద్దరు సీఎంలు ఈ సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపాలని ఆయన కోరారు. ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్టమ్రని, కాళేశ్వరం ప్రాజెక్టును సవాలుగా స్వీకరించామని చెప్పిన కేసీఆర్, కేంద్రాన్ని పదే పదే టార్గెట్ చేయడమేంటన్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేదని, విభజన సమయంలో పార్లమెంటులో ఉన్న కేసీఆర్ , అప్పుడు మాట్లడకుండా ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్రానికి అన్ని రాష్ట్రాలు సమానమన్నారు. తెలంగాణలో ఇప్పటికే నిలిచిపోయిన 11 ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇచ్చి పూర్తి చేస్తుందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని కాంగ్రెస్, బీజేపీ చెప్పలేదనద్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామన్నారు. గత పార్లమెంటు సమావేశాల్లో 370వ అధికరణ రద్దు, త్రిబుల్ తలాక్ బిల్లు తీసుకువచ్చామన్నారు. శీతకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తే ఏ అంశంపైన అయినా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 370 రద్దుతో కాశ్మీర్ ప్రశాంతంగా ఉందన్నారు. పార్లమెంటులో తమ ప్రభుత్వ అజెండాను దేశ ప్రజల ముందు ఉంచుతామన్నారు. విద్యావిధానం, వైద్య విధానం, నదుల అనుసంధానంపై చర్చ జరుపుతామన్నారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే ప్రసక్తిలేదన్నారు. ఒక ప్రశ్నకు బదులిస్తూ ఆర్టీసీ సమ్మె రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని వీడి చర్చలు జరపాలన్నారు.