రాష్ట్రీయం

నీట్ యూజీపై గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్టు ద్వారా మెడికల్, డెంటల్ కాలేజీల్లో యూజీ ప్రోగ్రాంలో చేరే విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. ఎయిమ్స్ లో యూజీ ప్రవేశపరీక్ష , జిప్‌మర్‌లో యూజీ ప్రవేశపరీక్షకు ప్రస్తుతం రెండు వేర్వేరు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటికి తోడు నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ద్వారా నీట్‌కు వేరే పరీక్ష జరుగుతోంది. ఈ మూడింటికీ కలిపి ఒకే పరీక్ష నిర్వహించాలనే ప్రతిపాదనను నేషనల్ మెడికల్ కమిషన్ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) చేసింది. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు పరీక్షలకు సంబంధించిన మార్పులను రెండేళ్ల ముందు చెబితేనే వారు దానికి సిద్ధం కాగలుగుతారు. ఎయిమ్స్ పరీక్ష 180 ప్రశ్నలతో 720 మార్కులకు జరుగుతుండగా, జిప్‌మ ర్ 200 మార్కులకు, నీట్ 720 మా ర్కులకు జరుగుతోంది. ఎయిమ్స్, జిప్‌మర్ సంస్థల్లో ఇక మీదట ఎలాం టి ప్రవేశపరీక్షలు నిర్వహించకుండా అంతా నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ఆధీనంలో జరిగే ఏకైక ఉమ్మడి ప్రవేశపరీక్ష పరిధిలోనే ఉండాలని కుటుంబ సంక్షేమ శాఖ అండర్ సెక్రటరీ సునీత దండియాల్ గత అక్టోబర్ 4వ తేదీన ఆయా సంస్థల డైరెక్టర్లకు లేఖ రాశా రు. కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఆమోదంతోనే ఈ ఆదేశాలు ఇస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. అయితే దీనిపై ఇటు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ లేదా ఎన్‌టీఏ లేదా కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈసారి జరిగే నీట్ ఎగ్జామ్‌లో ఎయిమ్స్ పరీక్ష, జిప్‌మర్ పరీక్షలు విలీనం అయినట్టా కానట్టా అనేది తేలడం లేదు.
నీట్ యూజీ విండో వచ్చే నెల 2వ తేదీన ప్రారంభం కాబోతోంది. ఇందు కు సంబంధించిన నోటిఫికేషన్ మరో వారంలో రాబోతోంది. డిసెంబర్ 31 వరకూ ఆన్‌లైన్‌లో అడ్మిషన్లకు అవకాశం కల్పిస్తారు. ఓసీటు రూ.1400, ఎస్సీ, ఎస్టీలు, ఒబీసీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులు రూ.750 రిజిస్ట్రేషన్ చార్జీగా చెల్లించాల్సి ఉంటుంది. గతే డాది నీట్‌కు 15,19,375 మంది దరఖాస్తు చేయగా అందులో 14,10,755 మంది
పరీక్ష రాశారు. వారిలో 5,34,072 మంది అన్‌రిజర్వుడ్ అభ్యర్ధులున్నారు. 2,11,303 మంది ఎస్సీ, 96,456 మంది ఎస్టీ, 6,77,544 మంది ఓబీసీ ఉన్నారు. ఈ సారి పరీక్ష ఫీజు కింద 192 కోట్ల 43 లక్షల 22వేల 162 రూపాయిలు ఎన్‌టీఏకు దక్కగా మరో 18 కోట్లు మెడికల్ కౌనె్సలింగ్ కమిటీకి దక్కింది. ఇందులో వారంతా చేసిన ఖర్చు 10 శాతం కూడా లేదు. యూజీ పరీక్ష 2020 మే 3న జరుగుతుంది. దాని ఫలితాలను 2020 జూన్ 4న ప్రకటిస్తారు.