రాష్ట్రీయం

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 14: నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని పదవీ బాధ్యతల చేపట్టారు. ఈ మేరకు వెలగపూడి సచివాలయంలోని మొదటి భవనంలో ఇన్‌చార్జి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నుండి ఆమె గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఐఏఎస్‌గా ఎంపికైన తర్వాత మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా తన సర్వీసును ప్రారంభించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు శాఖల్లో వివిధ హోదాల్లో పని చేశానన్నారు. తిరిగి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రానికి రావడం ఆనందదాయకంగా ఉందని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం, మార్గదర్శకత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అధికార బృందం సమష్టి కృషితో రాష్ట్రాన్ని ఆయా రంగాల్లో మెరుగైన రీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. కాగా 1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేశారు. టెక్కలి సబ్ కలెక్టర్‌గా, నల్గొండ జిల్లా సంయుక్త కలెక్టర్‌గా పని చేశారు. అదే విధంగా మున్సిపల్ పరిపాలన శాఖ డిప్యూటీ సెక్రటరీగా, స్ర్తి శిశు సంక్షేమ శాఖ పీడీగాను పని చేశారు. 2018 నుండి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత కార్యదర్శిగా పనిచేస్తూ నవ్యాంధ్రప్రదేశ్ ప్రస్తుతం రాష్ట్రానికి తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమెను పలువురు ఉన్నతాధికారులు, సీఎస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది సహా వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన వేద పండితులు నూతన సీఎస్‌కు ఆశీర్వచనాలు అందించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
*చిత్రం...ముఖ్యమంత్రిని కలిసిన సీఎస్ నీలం సాహ్ని