రాష్ట్రీయం

అయోధ్యలో భవ్యమైన రామ మందిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అయోధ్యలో భవ్యమైన రామమందిరాన్ని నిర్మిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం నాడు ఎన్టీఆర్ స్టేడియంలో భక్తిటీవీ నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న భక్తి టీవీ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. కైలాసం హైదరాబాద్‌కు దిగివచ్చిందా అన్నట్టు అత్యంత వైభవంగా కోటిదీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారని కిషన్‌రెడ్డి అభినందించారు. అనేక సంవత్సరాల నుండి ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది హిందువుల ప్రార్ధనను భగవంతుడు అంగీకరించి అయోధ్యలో రామజన్మభూమి మందిరాన్ని నిర్మించాలని సుప్రీంకోర్టు తీర్పు రూపంలో ఆశీర్వదించారని అన్నారు. అయోధ్యలో భవ్యమైన మందిర నిర్మాణం కాబోతోందని కిషన్‌రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో రామమందిర నమూనాను కోటిదపోత్సవంలో ప్రదర్శించాలని అన్నారు. ప్రతిరోజూ విగ్రహమూర్తులను ప్రదర్శిస్తూ భక్తిని అందించే విధంగా, దేవుడి దీవెనలు అందిస్తున్నారని హిందువుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి నిర్వహించిన కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియం బుధవారం రాత్రి శివనామస్మరణతో మార్మోగిపోయింది. జై గణపతి, జైగణపతి నినాదాలతో స్టేడియం పులకించిపోయింది. భక్తిటీవీ కోటిదీపోత్సవానికి 11వ రోజు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కాజీపేట శే్వతార్క గణపతికి కోటి గరికార్చన , సకలాభిష్టాలను ప్రసాదించే కాణిపాకం వరసిద్ధివినాయకుడికి, కుజదోషాలు హరించే మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి కన్నుల పండువగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. మూషిక వాహనంపై లంబోదరుడు, మయూర వాహనంపై సుబ్రహ్మణ్యస్వామి దర్శనం ఏర్పాటు చేశారు. ఎన్‌టీవీ అధినేత నరేంద్రనాధ్ చౌదరి కేంద్ర మంత్రి దంపతులనుసత్కరించారు. రామచంద్రమిషన్ అంతర్జాతీయ కమిటీ అధ్యక్షుడు కమలేష్ డి పటేల్, జగన్నాధ స్వామి మఠాధిపతి వ్రతధార రామానుజ జియర్ స్వామి, శివస్వామి, నగర కమిషనర్ అంజనీ కుమార్ దంపతులు, టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, భజరంగదళ్ నేత సోహన్ లాల్ సోలంకి కూడా హాజరయ్యారు. బుధవారం నాటి కార్యక్రమానికి మల్లాప్రగడ ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా రామచంద్ర మిషన్ అధిపతి కమలేష్ మాట్లాడుతూ కోటిదీపోత్సవం పరమాద్భుతమని అన్నారు. సకలాభిష్టాలను తీర్చే ఈ ధ్యానం అందరికీ నిత్యజీవితంలో భాగం కావాలని అన్నారు. టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ కోటిదీపోత్సవం ద్వారా హిందూ ధర్మ ప్రచారానికి ఎంతో వ్యాప్తి వస్తోందని అన్నారు. భక్తులకు కోటిదీపోత్సవం ద్వారా స్వామి వారి కీర్తిని తెలియజేయడమేగాక, ప్రవచనాలతో దైవ భక్తిని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మైహోం జూపల్లి రామేశ్వరరావు అతిథులను సత్కరించారు. గురువారం నాటి కార్యక్రమంలో సింహాద్రి అప్పన్న చందనోత్సవం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు.

*చిత్రం... కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి