రాష్ట్రీయం

ఉగ్రవాదంపై రాజీపడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 12: ఉగ్రవాదంపై భారత్ రాజీపడే ప్రసక్తే లేదని, ఇదే విషయాన్ని అస్ట్రేలియ రాజధాని మెల్‌బోర్న్‌లో జరిగిన ప్రపంచ సదస్సులోనే స్పష్టం చేసినట్టు రక్షణ శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా కేంద్ర మంత్రి హోదాలో మంగళవారం విశాఖ వచ్చిన ఆయన ఆత్మీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెల్‌బోర్న్‌లో జరిగిన నో మనీ ఫర్ టెర్రర్ సదస్సులో పాల్గొనడం తనకు దక్కిన అరుదైన అవకాశంగా పేర్కొన్నారు. వచ్చే ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో ఇదే సదస్సును భారత్‌లో నిర్వహించేందుకు ఒప్పించినట్టు తెలిపారు. పాకిస్తాన్ అంటే చంపే దేశం, భారతీయులు చనిపోయేవారు అనే అభద్రతను పూర్తిగా తొలగించామన్నారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారికి గతంలో ఘన నివాళులర్పించే సంప్రదాయాన్ని పూర్తిగా మార్చి ఇప్పుడు ఎదురుదాడి చేసే స్థైర్యాన్ని అందించామన్నారు. వింగ్ కమాండర్
అభినందన్‌ను తిరిగి భారత్ రప్పించకోగలిగామంటే అది ప్రధాని మోదీ తీసుకున్న చొరవగా పేర్కొన్నారు. పఠాన్‌కోట్ ఘటన అనంతరం మన రక్షణ రంగం మరింత పటిష్టమైందన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు పూర్వం 40వేల మంది భారతీయులు చనిపోయారని, ఆర్టికల్‌ను రద్దు చేసి కశ్మీర్‌లో పరిస్థితులు పూర్తి అదుపులోకి తీసుకువచ్చిన ఘటన ప్రభుత్వానిదేనన్నారు. ఆర్టికల్ 370 కారణంగా గత 70 ఏళ్లుగా కశ్మీర్‌లో రాజ్యాంగ హక్కులు పూర్తిగా ఉల్లంఘనకు గురయ్యాయన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేస్తే కొన్ని రాజకీయ పక్షాలు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముందస్తు జాగ్రత్తల కోసమే జమ్ము-కశ్మీర్‌లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. అల్లర్లు జరిగి, ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన తరువాత చర్యలు తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదన్నారు. అయోధ్య వివాదం పరిష్కారం కావాలని ప్రభుత్వం కోరుకుందన్నారు. భారత ప్రజలు హర్షించే రీతిలో తీర్పు వచ్చిందన్నారు. కేంద్ర మంత్రి అమిత్‌షా దగ్గర పనిచేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అమిత్‌షా తనకు హెడ్మాస్టర్ వంటి వారని పేర్కొన్నారు. ఒకప్పుడు మతకలహాలు జరిగితే హైదరాబాద్‌లో కర్ఫూ అమలయ్యేదని, గత అయిదేళ్లుగా హైదరాబాద్‌లో కర్ఫూ అనే మాటే వినిపించలేదంటే అది కేంద్రం ఘనతేనన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డిని వివిధ పార్టీల నాయకులు ఘనంగా సత్కరించారు.
*చిత్రం...కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డిని సత్కరిస్తున్న మంత్రి అవంతి శ్రీనివాస్ తదితరులు