రాష్ట్రీయం

100 గం. నిర్విరామ శాస్ర్తియ నృత్యోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 10: వంద గంటల పాటు నిర్విరామంగా శాస్ర్తియ నృత్య ప్రదర్శనకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికైంది. గత నాలుగు రోజులుగా రాజమహేంద్రవరంలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో అనేక ప్రాచీన నృత్య రీతులతో ‘్భరతీయ సనాతన శాస్ర్తియ నృత్యోత్సవం’ పేరిట దేశ వ్యాప్తంగా వచ్చిన శాస్ర్తియ నృత్య కళాకారులు తమ ప్రదర్శనలతో మంత్రముగ్దులను చేశారు. బుధవారం (6వ తేదీన) ఆరంభమైన నృత్య ప్రదర్శనలు నిర్విరామంగా సాగి, ఆదివారం రాత్రితో ముగిశాయి. కూచిపూడి, భరత నాట్యం, పేరిణి, ఆంధ్ర నాట్యం, జానపదం, ఒడిస్సీ తదితర నృత్య రీతులను వెయ్యి మంది కళాకారులు ప్రదర్శించారు. స్థానిక ఆనం కళా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ భాషా-సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కళాప్రియ నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో భారతీయ సనాతన శాస్ర్తియ నృత్సోత్సవం 6వ తేదీన ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పేరిణి నృత్యం కాకతీయుల కాలం నుంచీ వస్తున్న ఈ నృత్యాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారిక నృత్యంగా చేసింది. ఏపీలో కూడా పేరిణి నృత్యం వుంది. పేరిణి, కూచిపూడి, భరతనాట్యం నృత్య రీతుల సమాహారంగా అనేక మంది గురువులు తీర్చిదిద్దిన కళాకారులు దేశవ్యాప్తంగా తరలివచ్చి ప్రదర్శనలిచ్చారు. ముందుగా నాట్య గురువులు, శిష్య బృందంతో నృత్య ప్రదర్శనలు ఆరంభించారు. వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కార్పొరేటర్ శ్రీహరి, కళాప్రియ నత్య కళా క్షేత్రం డాక్టర్ పేరిణి ఆచంట చంద్రశేఖర్, పేరిణి లంకా సతీష్ కుమార్ ఆహ్వాన కమిటీగా ప్రతీ రోజూ రాత్రి ఎనిమిది గంటల వరకు నిర్విరామంగా ప్రదర్శనలు నిర్వహించారు. 100 గంటలకు పైగా సాగిన నృత్యోత్సవం 10వ తేదీ రాత్రితో ముగిసింది. దేశం నలుమూలల నుంచి వివిధ నృత్యరీతులకు చెందిన వెయ్యి మంది నాట్య కళాకారులు హాజరయ్యారు. అనంతరం నాట్య గురువులకు సత్కారాలు చేశారు.