రాష్ట్రీయం

కొత్త కళాశాలలకు అనుమతి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 9: సంక్షోభంలో ఉన్న సాంకేతిక విద్యను గాడినపెట్టేందుకు ప్రక్షాళన చర్యలు చేపడుతున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చైర్మన్ అనిల్ డీ సహస్రబుదే తెలిపారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పదో స్నాతకోత్సవం విశాఖ క్యాంపస్‌లో శనివారం జరిగింది. ఈ సందర్భంగా పట్ట్భద్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మరో రెండేళ్లపాటు ఈ నిషేధం అమలు చేసే ఆలోచన ఉందన్నారు. ఇంజనీరింగ్ టీచింగ్ ఫ్యాకల్టీలో నాణ్యత కొరవడుతోందని, ఈ సమస్యను అధిగమించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో 100 వరకూ శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. వచ్చే ఏడాది మరో 500 శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యను పటిష్ఠపరిచే చర్యల్లో భాగంగా 2700 కోర్సులు రూపొందించిందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారంతో ఏఐసీటీఈ మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సు (మూక్) అందుబాటులోకి తెచ్చిందని, వీటిని దేశంలోని ప్రముఖ ప్రొఫెసర్లు మేధోమథనం చేసి రూపొందించారన్నారు. సాంకేతిక విద్యనభ్యసించే విద్యార్థులు సులభంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారా ఉచితంగా ఈ కోర్సులు డౌన్‌లోడ్ చేసుకుని ప్రయోజనం పొందవచ్చన్నారు. 2017లో ఏఐసీటీఈ నిర్వహించిన స్టార్ ఇండి హ్యాకథాన్, సింగపూర్, ఇండియా హ్యాకథాన్‌లు విజయవంతమైనట్టు తెలిపారు. త్వరలోనే ఏసియాన్, బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సేక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్(బైమ్‌స్టెక్) హ్యాకథాన్ నిర్వహణకు సిద్ధమవుతున్నామని తెలిపారు.
దేశంలోని ఉన్నత విద్యాసంస్థలు ప్రపంచ శ్రేణి పట్ట్భద్రులను తయారు చేసే సంస్థలుగా మార్పు చెందాలని, దీనికి విద్యార్థులతో పాటు అధ్యాపకులు సైతం సమానంగా నిరంతరం అధ్యయనం చేస్తూ ఉండాలని సూచించారు. బోధన, పరిశోధనలతో పాటు నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక వేత్తలుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు జీవశాస్త్రాలు, భౌతిక శాస్త్ర విద్యార్థులు తత్వ శాస్త్రాన్ని, వైద్య విద్యార్థులు మానసిక శాస్త్రాన్ని, న్యాయశాస్త్ర విద్యార్థులు సామాజిక శాస్త్రాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టవచ్చన్నారు. విశ్వవిద్యాలయాలు పరిశ్రమలతో సంబంధాలు పెంచుకోవడం ద్వారా పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా సిలబస్‌లో మార్పులు, కోర్సుల రూపకల్పన జరుగుతుందన్నారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్‌సిటీల ప్రకటన ద్వారా దేశంలోని సాంకేతిక విద్యనభ్యసించే యువతకు విస్తృతమైన అవకాశాలు ఎదురు చూస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోలవాలని సూచించారు. ముఖ్య అతిథి సహస్రబుదేకు గీతం ఛాన్సలర్ కోనేరు రామకృష్ణారావు గీతం విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ సైన్స్) అందజేశారు.
స్నాతకోత్సవంలో భాగంగా తెలుగు సాహితీ వికాసానికి కృషి చేస్తున్న ప్రఖ్యాత కథా రచయిత, విమర్శకుడు కాళీపట్నం రామారావు (కారా మాస్టారు)కు డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డిలిట్)ను, రక్షణ రంగ పరిశోధన శాస్తవ్రేత్త, ఇస్రో చైర్‌ప్రొఫెసర్ వి.్భజంగరావు, ఉచిత పోలియో శస్త్ర చికిత్సల ద్వారా సామాజిక సేవలందిస్తున్న ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ ఎస్‌వీ ఆదినారాయణ రావులకు డాక్టర్ ఆఫ్ సైన్స్ (డీఎస్సీ) గౌరవ డాక్టరేట్‌లను గీతం ఛాన్స్‌లర్ అందజేశారు. గీతం వైస్‌ఛాన్స్‌లర్ కె.శివరామకృష్ణ వార్షిక నివేదిక సమర్పించారు.
కార్యక్రమంలో గీతం విద్యా సంస్థల చైర్మన్ ఎం.శ్రీ భరత్, ఉపాధ్యక్షులు ఎం.గంగాధర రావు, ప్రో వైస్‌ఛాన్స్‌లర్ కె.శివప్రసాద్, రిజిస్ట్రార్ కేవీజీడీ బాలాజి, విశ్వవిద్యాలయం అకడమిక్ డీన్‌లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా పూర్వపు సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ విద్యార్థులు నల్లకోటు, టోపీ స్థానంలో తెల్లటి కుర్తా పైజమా ధరించగా, గీతం తరపున ఖాదీ కండువాను కప్పి స్నాతకోత్సవ పట్టాలు అందజేశారు.
*చిత్రం... గీతం గౌరవ డాక్టరేట్ అందుకుంటున్న కారా మాస్టారు