రాష్ట్రీయం

ఆలయాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 9: అధికారం చేతిలో ఉంది కదా అని తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే నియంతృత్వ ధోరణి విడనాడి దేవాలయాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం గుంటూరులోని ఆర్యసమాజంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కో కన్వీనర్ సిరిపురపు శ్రీ్ధర్ అధ్యక్షత వహించారు. సమావేశంలో దళిత, కాపు, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, ముస్లిం, క్రిస్టియన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగుల తొలగింపు, సీఎస్ పదవి నుంచి ఎల్‌వీ సుబ్రహ్మణ్యంను అవమానకర రీతిలో తొలగించటం, దేవాదాయ శాఖ భూముల అన్యాక్రాంతం అనే అంశాలపై రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు చర్చించారు. ఈ సందర్భంగా చైతన్య వేదిక కో కన్వీనర్ సిరిపురపు శ్రీ్ధర్, పలువురు ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న అన్య మతస్థులపై క్షుణ్ణంగా విచారణ చేసి వేరే ప్రభుత్వ శాఖల్లోకి తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యంను అత్యంత అవమానకరంగా తొలగించడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి అద్దం పడుతుందన్నారు. ఎల్వీ బదిలీపై విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. బిల్డ్ ఏపీ అనే కార్యక్రమం ద్వారా దేవాదాయ శాఖ భూములను తమకు నచ్చిన వారికి అప్పనంగా కట్టబెట్టాలని ముఖ్యమంత్రి చూస్తున్నారంటూ మండిపడ్డారు. తమకు అడ్డుగా ఉన్న ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యంను కుట్రపన్ని బదిలీ చేశారన్నారు. ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రజలను చైతన్యపరుస్తూ రాష్టవ్య్రాప్త ఉద్యమాన్ని ప్రజా సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నేతృత్వంలో బ్రాహ్మణ చైతన్య వేదిక నిర్వహించనుందని పేర్కొన్నారు. లౌకికదేశంలో ప్రతి ఒక్కరి మతవిశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, ప్రభుత్వాలే మత విద్వేషాలను రెచ్చగొడితే శాంతిభద్రతలను ఎవరు కాపాడతారంటూ ప్రశ్నించారు. టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించే జీవోను తక్షణమే అమలు చేయాలని, దేవాలయ భూములను ప్రభుత్వం తీసుకోదని ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో క్రైస్తవ ఆస్తుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు కర్రా హానోక్ బెంజిమన్, ముస్లిం సంక్షేమ నాయకుడు షేక్ బాబర్, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గోళ్ల అరుణ్‌కుమార్, కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రాము, ఎస్టీ సంఘ ప్రతినిధి బాణావత్ ధారూనాయక్, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు మారం కిషోర్, అర్చక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధాల్య రామలింగేశ్వర శాస్ర్తీ, బీజేపీ నాయకుడు దారా అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.