రాష్ట్రీయం

కార్తీకంలో శివారాధన సర్వశుభప్రదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), నవంబర్ 9: జటాజూఠధారియై, గంగను శిరస్సున ధరించిన భోళాశంకరుడైన మహాశివుడిని సంవత్సరంలో ఏ రోజున ఏ క్షణాన ధ్యానించినా, సేవించినా శుభప్రదమేనని, మరీ ముఖ్యంగా పర్వదినాలన్నీ కలిసిన ఈ కార్తీకమాసంలో లయకారకుడిని సేవించడం సర్వశుభప్రదం, అనంతకోటి ఫలదాయకమని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. గుంటూరులోని భక్తుల విజ్ఞప్తి మేరకు శనివారం నగరానికి విచ్చేసిన స్వామీజీ ఇక్కడి కొత్తపేట గుంటూరువారితోటలో తనను కలిసిన మీడియానుద్దేశించి మాట్లాడారు. వైఎస్‌ఆర్ సీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ దంపతులు, పలువురు భక్తుల ఆహ్వానం మేరకు స్వామీజీ విచ్చేసి పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్తీకమాసం విశిష్టతపై స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ శివుడెప్పుడూ శుభంకరుడేనన్నారు. శివనామ స్మరణ మహాముక్తిదాయకమని, ప్రధానంగా ఈ కార్తీకమాసంలో పరమేశ్వరుడిని రుద్రాభిషేకాలతో అభిషేకించి బిళ్వదళాలతో అర్చిస్తే స్వామి ఐశ్వర్యాన్ని కూడా ఇస్తారన్నారు. ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడని మన పురాణాలు తెలియజేస్తున్నాయని స్వామీజీ గుర్తుచేశారు.
ఈ కార్తీకమాసంలో ఉసిరిచెట్టు కింద కార్తీక దీపార్చన చేసినా, పూజలు చేసుకున్నా నారీ శిరోమణుల జీవితాలు మహామంగళప్రదం అవుతాయని స్వామీజీ అన్నారు. అమరావతి, గుంటూరు కృష్ణాతీర ప్రాంతం అంటే తనకు ఎంతో ఇష్టమని, చాతుర్మాస్య దీక్షకు వెళ్లబోయే ముందు తమ పీఠం ఉత్తరాధికారిగా స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతిని కృష్ణానది ఒడ్డున ఓ ఉత్సవంలాగా జరిగిన వేడుకల్లో పీఠాధిపతిగా అభిషిక్తులను చేశామన్నారు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని స్వామీజీ గుర్తుచేశారు. ఉభయ రాష్ట్రాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరికీ మంచి జరగాలని తానెల్లప్పుడూ కోరుకుంటూనే ఉంటానన్నారు. స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతిని పీఠాధిపతిగా పట్ట్భాషిక్తులను చేసిన అనంతరం తాను ఎక్కువగా ఆధ్యాత్మిక దైవసేవ, ధర్మప్రచారంలో ఉన్నానని చెప్పారు.
స్వామీజీ గుంటూరుకు విచ్చేసిన సందర్భంగా ఉప సభాపతి కోన రఘుపతి, రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీరంగనాథరాజు, జిల్లా మంత్రి మోపిదేవి వెంకట రమణారావు, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, హమమ్మద్ ముస్త్ఫా, వైసీపీ నాయకులు చుక్కా ఏసురత్నం, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు స్వామి ఆశీస్సులు అందుకున్నారు.
*చిత్రం...మీడియాతో మాట్లాడుతున్న స్వామీజీ